- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
2026లో రెట్టింపు సంతోషం, అభివృద్ధి అందిస్తాం: ప్రజలకు సీఎం చంద్రబాబు న్యూ ఇయర్ విషెస్
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు 2026 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు 2026 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. 2025సంవత్సరంలో కూటమి ప్రభుత్వం పాలనలో ఎన్నో మైలురాళ్లను అధిగమించిందని ఎక్స్ లో పోస్ట్ చేశారు. "అనేక సంక్షేమ కార్యక్రమాలకు, అభివృద్ధి పనులకు 2025 ఏడాది నాంది పలికింది. ఏ రంగంలో చూసినా... 2025 కేవలం ఒక గడిచిన సంవత్సరం కాదు.... నాటి విధ్వంసం నుంచి ఆంధ్రప్రదేశ్ ను వికాసం వైపు నడిపించిన గొప్ప మలుపు. ఎన్నో సంక్షోభాలను, సమస్యలను, సవాళ్లను అధిగమించి గొప్ప పురోగతి సాధించిన సంవత్సరంగా 2025 గుర్తుండిపోతుంది. ఇదే స్ఫూర్తితో ఇంగ్లీషు క్యాలెండర్ ప్రకారం ప్రారంభమయ్యే 2026 నూతన సంవత్సరం అందరి జీవితాలలో కొత్త కాంతులు నింపాలని మనసారా కోరుకుంటున్నాను. ఈ ఏడాది ప్రజలకు రెట్టింపు సంతోషం - సంక్షేమం - అభివృద్ధి అందించేందుకు కృషి చేస్తానని మాటిస్తున్నాను. హెల్తీ, వెల్తీ, హ్యాపీ ఏపీ లక్ష్యాన్ని చేరుకోవడంలో ఈ ఏడాది మరెన్నో అడుగులు పడాలని కోరుకుంటూ....అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ 2026" అని ఆ పోస్టులో రాసుకొచ్చారు.






