కడప టీడీపీ అడ్డా: సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-05-29 11:18:04  IST  )

కడప టీడీపీ అడ్డా అని ఆ పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు...

కడప టీడీపీ అడ్డా:  సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: కడప టీడీపీ అడ్డా అని ఆ పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు నాయుడు(Cm Chandrababu Naidu) అన్నారు. కడప టీడీపీ మహానాడు(Kadapa Tdp Mahanadu) బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. కడప తమ అడ్డా అని చెప్పేందుకు సభ నిర్వహించినట్లు చంద్రబాబు పేర్కొన్నారు. రాష్ట్రమంతా రాయలసీమ(Rayalaseema) గర్జన వినిపించాలన్నారు. మంచి చేసిన టీడీపీకి అండగా ఉంటామని ప్రజలు నిరూపించారన్నారు. కడప దిగ్బంధమైందని, అన్ని దారులు ఇటే ఉన్నాయని చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన టీడీపీ మహానాడు సూపర్ సక్సెస్ అయిందని ఆనందం వ్యక్తం చేశారు. ఈసారి టీడీపీ మహానాడు జాతరగా జరిగిందని చంద్రబాబు పేర్కొన్నారు.

కడపలో మహానాడు నిర్వహించలేరని చాలెంజ్ చేశారని, కానీ ఇది టీడీపీ అడ్డా అని నిరూపించామని చంద్రబాబు వ్యాఖ్యానించారు. కడపలో రాజకీయం మారుతోందని, అది చాలా స్పష్టంగా కనిపిస్తోందన్నారు. అహంకారంతో విర్రవీగే వారికి ప్రజలు ఓట్లు వేయరనే విషయం ఎన్నికల్లో అర్ధమయ్యే ఉంటదని సెటైర్స్ వేశారు. రాయలసీమ మొత్తంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి 7 సీట్లు వస్తే.. ఒక్క కడప జిల్లాలోనే తెలుగుదేశం పార్టీ 7 సీట్లు గెలిచిందని ఎద్దేవా చేశారు. 2029 ఎన్నికల్లో ఉమ్మడి కడప జిల్లాలో అన్ని సీట్లు గెలవాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. తెలుగుదేశం పార్టీ ప్రజల కోసం పుట్టిందని, పాలన ఎలా ఉండకూడ చూపించిన పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ అని చంద్రబాబు విమర్శలు చేశారు.

Next Story