ఏపీకి గుడ్ న్యూస్.. అందుబాటులోకి మరో నాలుగు పోర్టులు..?

by Vemula.Srinu Prasad |

ఆంధ్రప్రదేశ్‌కి సీఎం చంద్రబాబు నాయుడు గుడ్ తెలిపారు......

ఏపీకి గుడ్ న్యూస్.. అందుబాటులోకి మరో నాలుగు పోర్టులు..?
X

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)కి సీఎం చంద్రబాబు నాయుడు(Cm Chandrababu) గుడ్ తెలిపారు. రాష్ట్రంలో మరో 4 ఎయిర్ పోర్టులను అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఆయన తెలిపారు. సింగపూర్‌లో రెండు రోజులుగా పర్యటిస్తున్న సీఎం..ఏపీ-సీంగపూర్ బిజినెస్ ఫోరం(AP-Singapore Business Forum)లో మాట్లాడారు. అమెరికా సిలికాన్ వ్యాలీ(Americas Silicon Valley) తరహాలో అమరావతి(Amaravati)లో క్వాంటమ్ వ్యాలీ(Quantum Valley) ఏర్పాటు చేస్తున్నామని ఆయన తెలిపారు. సురక్షిత పెట్టుబడులకు గమ్యస్థానం ఆంధ్రప్రదేశ్ అని చెప్పారు. ఏపీని గ్రీన్ హైడ్రోజన్(Green Hydrogen) హబ్‌గా తయారు చేస్తామన్నారు. నవంబర్ 14, 15 తేదీల్లో సీఐఐ, రాష్ట్ర ప్రభుత్వం సదస్సు నిర్వహిస్తున్నాయని పేర్కొన్నారు. సీఐఐ, రాష్ట్ర ప్రభుత్వం సదస్సుకు సింగపూర్ ప్రతినిధులకు పిలుపునిస్తున్నామన్నారు. ఉద్యోగ అవకాశాలున్న అన్ని రంగాల్లో ఎంవోయూ చేసుకోవాలన్నారు. విశాఖ సదస్సు ద్వారా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు చాలా ప్రాజెక్టులు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ప్రస్తుతం పీ4 విధానాన్ని అమలు చేస్తోందని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.

Next Story