- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అన్ని ఆలయాల్లో 'శ్రీవారి సేవకులు' తరహా విధానం: సీఎం చంద్రబాబు ఆదేశాలు
రాష్ట్రంలోని అన్ని ఆలయాల్లో శ్రీవారి సేవకులు తరహాలో స్వచ్ఛంద సేవల్ని ప్రవేశపెట్టాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలోని అన్ని ఆలయాల్లో శ్రీవారి సేవకులు తరహాలో స్వచ్ఛంద సేవల్ని ప్రవేశపెట్టాలని సీఎం చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అన్ని దేవాలయాల్లో స్థానిక భక్తులను వాలంటీర్లుగా నియమించుకోవాలని సూచించారు. దేవుడికి సేవ చేసేందుకు చాలామంది ముందుకొస్తారని. వారిని ప్రోత్సహించాలని తెలిపారు. సోమవారం అమరావతిలోని ఆర్టీజీఎస్ నుంచి వ్యవసాయం, రెవెన్యూ, వైద్యారోగ్యం, దేవాదాయ సహా పలు కీలక శాఖల పనితీరుపై సీఎం సమీక్ష నిర్వహించారు. క్షేత్రస్థాయిలో ప్రభుత్వ సేవలు ప్రజలకు ఎలా అందుతున్నాయో వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వివిధ శాఖల అధికారులకు కీలక సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. రెవెన్యూ సేవలను ప్రజలకు మరింత సులభంగా అందించాలని, భూ సర్వేల్లో ఎలాంటి తప్పిదాలకు ఆస్కారం ఇవ్వొద్దని స్పష్టం చేశారు.
మెరుగైన ప్రజారోగ్యం కోసం వ్యవసాయ, వైద్యారోగ్య శాఖలు సమన్వయంతో పనిచేయాలని సీఎం పిలుపునిచ్చారు. రైతులకు భూసార పరీక్షలు, ఎరువుల వాడకాన్ని తగ్గించేలా అవగాహన కల్పించాలని సూచించారు. ధాన్యం కొనుగోళ్లలో రైతన్నలకు ఎలాంటి ఇబ్బందులు రాకూడదని, మిల్లర్లు ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకురావాలని చూస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.






