- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మద్యం విధానాన్ని వ్యాపారంలా చూడకండి : సీఎం చంద్రబాబు
రాష్ట్రంలో మద్యం విధానాన్ని వ్యాపారంలా కాకుండా.. ఆరోగ్యకరమైన వృద్ధిని..

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో మద్యం విధానాన్ని వ్యాపారంలా కాకుండా.. ఆరోగ్యకరమైన వృద్ధిని సాధించేదిగా చూడాలని సీఎం చంద్రబాబు అధికారులకు సూచించారు. సచివాలయంలో ప్రొహిబిష్, ఎక్సైజ్ శాఖపై సీఎం చంద్రబాబు, మంత్రులు కొల్లు రవీంద్ర, కొండపల్లి శ్రీనివాస్, ఉన్నత అధికారులతో సమీక్ష నిర్వహించారు. మద్యాన్ని కేవలం ఒక ఉత్పత్తిలాగానే చూడాలని, ఆదాయమే లక్ష్యంగా మద్యం విధానాలు ఉండకూడదని సీఎం స్పష్టం చేశారు. ప్రస్తుతం ఉన్న లాటరీ పద్ధతిలోనే షాపుల కేటాయింపు, అప్లికేషన్ ఫీజు, లిక్కర్ ఐడెంటిఫికేన్ నెంబర్, రిటైలర్ మార్జిన్ పెంపు వంటి అంశాలపై మరింత కసరత్తు చేయాలని దిశానిర్దేశం చేశారు. అక్రమ మద్యాన్ని అరికట్టడం, బెల్టుషాపుల నియంత్రణ, డిజిటలైజేషన్, పర్యావరణ పరిరక్షణకు సంబంధించి సంస్కరణలు తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. అలాగే అనధికారికంగా ఏర్పాటు చేసిన మద్యం దుకాణాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. హర్యానాలో అధికారులు అనుసరించిన సబ్ లీజ్ విధానాన్ని అధ్యయనం చేయాలని కూడా సూచించారు.






