వేట్లపాలెం బాధితులకు అసెంబ్లీ వేదికగా సీఎం సంచలన హామీ

by Vemula.Srinu Prasad |

కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెం బాధిత కుటుంబాలకు సీఎం చంద్రబాబు నాయుడు తాజాగా అసెంబ్లీ వేదికగా కీలక హామీ ఇచ్చారు.....

వేట్లపాలెం బాధితులకు అసెంబ్లీ వేదికగా సీఎం సంచలన హామీ
X

దిశ, వెబ్ డెస్క్: కాకినాడ జిల్లా(Kakinada District) సామర్లకోట మండలం వేట్లపాలెం(Vetlapalem)లో ఘోర ప్రమాదం జరిగి 26 మంది చనిపోయిన విషయం తెలిసిందే. అయితే బాధిత కుటుంబాలకు సీఎం చంద్రబాబు నాయుడు(Cm Chandrababu Naidu) తాజాగా అసెంబ్లీ వేదికగా కీలక హామీ ఇచ్చారు. మృతుల కుటుంబాలకు ఇళ్లు కట్టించి ఇస్తామని ఆయన తెలిపారు. వేట్లపాలెం మృతులకు ఆయన సంతాపం ప్రకటించారు. వేట్లపాలెం ప్రమాదంలో 26 మంది మృతి చెందడం బాధాకరమన్నారు. స్పాట్‌లో 20 మంది చనిపోగా చికిత్స పొందుతూ ఆరుగురు మృతి చెందారని చెప్పారు. ఘటనకు కారణమైన సూర్యశ్రీ ఫైర్ వర్క్‌(Suryashri Fire Work)కు వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం(YSR Congress government)లో అనుమతిచ్చారని తెలిపారు. నిబంధనలను తుంగలో తొక్కి బాణసంచా తయారు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. పరిమితికి మించి మందుగుండు నిల్వ చేయడంతో ప్రమాదం భారీగా జరిగిందని చెప్పారు. నిందితుడి ఇప్పటికే కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.

Next Story