టీడీపీ మాజీ ఎంపీ, నటుడు కైకాలకు సీఎం చంద్రబాబు నివాళి

by Naga Rani Yarlagadda |   (  Updated:2025-07-26 02:11:26  IST  )

టీడీపీ మాజీ పార్లమెంట్ సభ్యులు కైకాల సత్యనారాయణ జయంతి సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు..

టీడీపీ మాజీ ఎంపీ, నటుడు కైకాలకు సీఎం చంద్రబాబు నివాళి
X

దిశ, వెబ్‌డెస్క్: టీడీపీ మాజీ పార్లమెంట్ సభ్యులు కైకాల సత్యనారాయణ (Kaikala Satya Narayana) జయంతి సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) ఆయనకు నివాళి అర్పించారు. 60 సంవత్సరాల్లో సుమారు 800 చలన చిత్రాల్లో వైవిధ్యమైన పాత్రల్ని పోషించి, నవరస నటశిఖరం అనే పేరును సంపాదించుకున్న కైకాల కళాసేవను, ప్రజాసేవను ఆయన జయంతి సందర్భంగా స్మరించుకుందాం అని ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు.

నవరస నటశిఖరమే కాదు.. నవరస నటనా సార్వభౌమ అనే బిరుదు కూడా ఆయన సొంతం. కైకాల సత్యనారాయణ 1935 జులై 25వ తేదీన కృష్ణాజిల్లాలోని గుడ్లవల్లేరు మండలం, కౌతవరం అనే గ్రామంలో జన్మించారు. గుడివాడ, విజయవాడల్లో స్కూల్ విద్యాభ్యాసం, గుడివాడలో డిగ్రీ పూర్తి చేశారు. 1959లో సిపాయి కూతురు అనే సినిమాలో అవకాశం లభించగా.. ఆ తర్వాత వరుస నటనా అవకాశాలు లభించాయి. 2011లో రఘుపతి వెంకయ్య అవార్డు, 2017లో లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ అవార్డు అందుకున్నారు.

Link

Next Story