- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
'బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్'గా సీఎం చంద్రబాబు
ఎకనామిక్ టైమ్స్ ద్వారా బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ 2025గా చంద్రబాబు నిలిచారు. ఈ విషయాన్ని మంత్రి నారాలోకేష్ ఎక్స్ పోస్టులో తెలిపారు. ఇ

దిశ, వెబ్ డెస్క్: ఎకనామిక్ టైమ్స్ ద్వారా బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ 2025గా చంద్రబాబు నిలిచారు. ఈ విషయాన్ని మంత్రి నారాలోకేష్ ఎక్స్ పోస్టులో తెలిపారు. ఇది తమ కుటుంబానికి మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎంతో గర్వకారణం అని అన్నారు. ఎకనామిక్ టైమ్స్ ద్వారా ఈ ఏడాది వ్యాపార సంస్కర్తగా చంద్రబాబు గౌరవించబడ్డారని పేర్కొన్నారు.
భారతదేశ సంస్కరణ ప్రయాణాన్ని కొంతమంది నాయకులు ఇంత ధైర్యం, స్పష్టత మరియు స్థిరత్వంతో రూపొందించారని పేర్కొన్నారు. సంస్కరణలు, వేగం మరియు పాలనపై చంద్రబాబు చూపిన అచంచల దృష్టికి ఈ అవార్డు నివాళి అని కొనియాడారు. ఇక ఈ ట్వీట్ కు కొన్ని గంటల ముందు నారాలోకేష్ కార్యకర్తలను, అభిమానులను సస్పెన్స్‌లో పెట్టారు. మధ్యాహ్నం 12 గంటలకు భారీ ప్రకటన ఉంటుందని ట్వీట్ చేశారు. ఇక ఆ సస్పెన్స్‌కు తెరతీస్తూ గుడ్ న్యూస్ వినిపించారు.






