ఆయనను నమ్మితే నాశనమే: ప్రజలకు సీఎం చంద్రబాబు సంచలన సందేశం

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-09-10 11:47:27  IST  )

ఆయనను నమ్మితే నాశనమేనని అనంతపురం ప్రజలకు సీఎం చంద్రబాబు సందేశమిచ్చారు..

ఆయనను నమ్మితే నాశనమే: ప్రజలకు సీఎం చంద్రబాబు సంచలన సందేశం
X

దిశ, వెబ్ డెస్క్: వైసీపీ అధినేత జగన్‌(Ycp Chief Jagan)ను నమ్మితే నాశనమేనని రాష్ట్ర ప్రజలకు సీఎం చంద్రబాబు నాయుడు(Cm Chandrababu Naidu) కీలక సందేశం ఇచ్చారు. అనంతపురంలో నిర్వహించిన ‘సూపర్ సిక్స్... సూపర్ హిట్’(Super Six... Super Hit) సభలో పాల్గొన్న ఆయన.. గత ఐదేళ్లలో జరిగిన అరాచకాలు, దౌర్జన్యాలను గుర్తు చేసి మండిపడ్డారు. రాష్ట్రంలో జగన్ పార్టీ ఉనికి కోల్పోందని, ఫేక్ రాజకీయాలు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ ఆఫీసులు ముసుకుపోయి... సోషల్ మీడియా కార్యాలయాలు తెరుచుకున్నాయని ఎద్దేవా చేశారు. ఎన్నికల్లో సిద్ధం.. సిద్ధం అని ఎగిరిపడ్డారని, ఇప్పుడేమో ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తామంటున్నారని సీఎం ధ్వజమెత్తారు.

రాజకీయాల్లో జగన్ ఓనమాలు కూడా తెలియవని, అలాంటి వ్యక్తి ప్రతిపక్ష హోదా అడుగుతున్నారని చంద్రబాబు మండిపడ్డారు. ఏ హోదా అయినా ప్రజలు ఇవ్వాల్సిందేనన్నారు. అసెంబ్లీకి రాని జగన్ రాజకీయాలకు అనర్హుడన్నారు. అసెంబ్లీకి రాకుండా రప్పా.. రప్పా అంటూ రంకెలెస్తున్నారని చెప్పారు. రప్పా రప్పా అంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెడితే పది నిమిషాల్లోనే పోలీసులు వచ్చి తమ పని పడతారని వార్నింగ్ ఇచ్చారు. పులివెందుల(Pulivendula), ఒంటిమిట్ట(Ontimitta) ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్(Ysr Congress) పార్టీ బెండు తీశామని ఎద్దేవా చేశారు. హింసా రాజకీయాలకు పాల్పడిన తగిన శిక్ష తప్పదని సీఎం చంద్రబాబు నాయుడు హెచ్చరించారు.

Next Story