కేంద్ర మంత్రి‌‌తో సీఎం చంద్రబాబు భేటీ.. కీలక రిక్వెస్ట్

by Ramesh Naini |

కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌‌తో గురువారం ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు.

కేంద్ర మంత్రి‌‌తో సీఎం చంద్రబాబు భేటీ.. కీలక రిక్వెస్ట్
X

దిశ, డైనమిక్ బ్యూరో: కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌‌తో గురువారం ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. వ్యవసాయం, అనుబంధ రంగాల సమగ్ర అభివృద్ధి, రైతుల ఆదాయాన్ని పెంచే చర్యలకు మరింత సహకరించాలని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌కు సీఎం చంద్రబాబు నాయుడు విజ్ఞప్తి చేశారు. కొబ్బరి పార్క్, ఆక్వా ల్యాబ్, మ్యాంగో బోర్డుతో సహా వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని రాష్ట్రంలో ఏర్పాటు చేయాలని కోరారు.

ఏపీ పునర్విభజన చట్టం-2014, షెడ్యూల్ 13 లో పేర్కొన్నట్టుగా రాష్ట్రంలో కేంద్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని కూడా కోరారు. రూ.2,585 కోట్ల అంచనాలతో డీపీఆర్‌ను వ్యవసాయ పరిశోధన, విద్య విభాగానికి సమర్పించినట్లు చెప్పారు. అమరావతి పర్యటనలో భాగంగా సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చిన కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌కు సీఎం ఈ మేరకు వినతి పత్రం అందించారు.

Next Story