- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆరు లేన్ల ఐకానిక్ వంతెనను కేంద్రమే నిర్మించాలి : గడ్కరీకి సీఎం చంద్రబాబు విన్నపం
by Naga Rani Yarlagadda |
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతో సమావేశమయ్యారు.

X
దిశ, వెబ్‌డెస్క్: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో.. కృష్ణానదిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన 6 లేన్ల ఐకానిక్ వంతెన నిర్మాణాన్ని కేంద్రమే చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. ఈ వంతెన మూలపాడు వద్దద 3 కీలకమైన జాతీయ రహదారులతో అమరావతిని అనుసంధానిస్తుందని తెలిపారు. విజయవాడ - హైదరాబాద్, చెన్నై - కోల్ కతా సహా తీరప్రాంత రోడ్ కారిడార్ తో అమరావతిని ఈ వంతెన అనుసంధానిస్తుందన్నారు. దీనివల్ల ప్రజలకు ప్రయాణ సమయం కూడా గణనీయంగా తగ్గుతుందని స్పష్టం చేశారు. అంతేకాక అమరావతిని జాతీయ రహదారి గ్రిడ్ లో మొబిలిటీ కేంద్రంగా, లాజిస్టిక్స్ నోడ్ గా కూడా మారుస్తుందని వెల్లడించారు. జాతీయ రహదారి నెట్ వర్క్ ను బలోపేతం చేయడంలో నితిన్ గడ్కరీ ఎంతో కృషి చేశారని కొనియాడారు.
Next Story






