అమరావతి రెండో విడత నిధులు : నిర్మలమ్మకు చంద్రబాబు కీలక విజ్ఞప్తి

by Naga Rani Yarlagadda |

ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) బుధవారం సాయంత్రం జలశక్తి శాఖతో సమావేశం అనంతరం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitaraman)తో భేటీ అయ్యారు.

అమరావతి రెండో విడత నిధులు : నిర్మలమ్మకు చంద్రబాబు కీలక విజ్ఞప్తి
X

దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) బుధవారం సాయంత్రం జలశక్తి శాఖతో సమావేశం అనంతరం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitaraman)తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై ఆమెతో చర్చించినట్లు తెలుస్తోంది. అమరావతి (Amaravati) నిర్మాణానికి రెండో విడత నిధులతో సీఎం చంద్రబాబు కీలక విజ్ఞప్తి చేశారు. రెండోవిడత నిధులను గ్రాంటుగా విడుదల చేయాలని అభ్యర్థించారు.

సాస్కి కింద అదనంగా రూ.10 వేల కోట్లను కేటాయించాలని కోరారు. అలాగే రెవెన్యూ లోటు భర్తీకి 16వ ఆర్థిక సంఘానికి ఇచ్చిన వినతిని అంగీకరించాలని కూడా విజ్ఞప్తి చేశారు. రాష్ట్రం విభజించి పదేళ్లు దాటినా.. ఇప్పటికీ ఆర్థికలోటును ఎదుర్కొంటున్న విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్టు (Polavaram Project)ల నిర్మాణానికి సహకరిస్తున్నందుకు కేంద్రానికి ధన్యవాదాలు తెలిపారు.

Next Story