అమరావతి అభివృద్ధిపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

by Vemula.Srinu Prasad |

అమరావతి అభివృద్ధిపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు...

అమరావతి అభివృద్ధిపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్ మాదిరిగా అమరావతిని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో సీఎం చంద్రబాబు నాయుడు అడుగులు వేస్తున్నాయి. అయితే అమరావతి అభివృద్ధికి 29 గ్రామాల పరిధి సరిపోదని ఆయన అంటున్నారు. మరిన్ని భూములు సేకరించాల్సిన అవసరం ఉంటుందని రైతుల ఎదుట చంద్రబాబు అభిప్రాయం వ్యక్తం చేశారు. సచివాలయం ఐదో బ్లాక్ కాన్ఫరెన్స్ హాలులో రాజధాని రైతులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ 29 గ్రామాల పరిధిలో అయితే అమరావతి ఓ మున్సిపాలిటీగా మాత్రమే అభివృద్ధి చెందుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. అమరావతి పూర్తి స్థాయి అభివృద్ధి చెందాలంటే తన నిర్ణయాలకు రైతులందరూ మద్దతు పలకాలని కోరుతున్నారు. ముందుగా కేపిటల్ గెయిన్స్ పై మరో రెండేళ్లు పన్ను మినయింపు కేంద్రాన్ని కోరాలని రైతులకు సూచించారు. కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ రాష్ట్ర పర్యటనలో రాజధాని రైతులు కోరాలని విజ్ఞప్తి చేశారు. రైతుల సమస్యలను త్రిసభ్య కమిటీ పరిష్కరిస్తుందని సీఎం చంద్రబాబు తెలిపారు.

Next Story