సాగునీటి ప్రాజెక్టుల పూర్తిపై ఫోకస్.. అసెంబ్లీ వేదికగా సీఎం కీలక వ్యాఖ్యలు

by Vemula.Srinu Prasad |

సాగునీటి ప్రాజెక్టుల పూర్తిపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు..

సాగునీటి ప్రాజెక్టుల పూర్తిపై ఫోకస్.. అసెంబ్లీ వేదికగా సీఎం కీలక వ్యాఖ్యలు
X

దిశ వెబ్ డెస్క్: రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల(Irrigation Projects)పై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. అసెంబ్లీ వేదికగా సీఎం చంద్రబాబు నాయుడు(CM Chandrababu Naidu) కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు స్పష్టం చేశారు. గత ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేసిందని తెలిపారు. తాము అధికారంలోకి వచ్చాక సాగునీటి సంఘాలు వేశామన్నారు. తమ నియోకవర్గాల్లో భూగర్భ జలాలు(Ground Water) పెరిగేలా ఎమ్మెల్యేలు చర్యలు తీసుకోవాలని సూచించారు. గత సంవత్సరంతో పోల్చితే ఈసారి భూగర్భ జలాల స్థాయి పెరిగిందని చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో మెజార్టీ ప్రాజెక్టులు(Majority Projects) ప్రారంభించింది తానేనని గుర్తు చేశారు. శ్రీశైలం(Srisailam) ద్వారా ఫ్లోరైడ్ బాధిత నల్లగొండ జిల్లా(Nalgonda District)కు నీరు ఇచ్చామని తెలిపారు. నీటిని సమర్థంగా వాడుకున్నప్పుడే కరవు పరిస్థితులు రావని సీఎం చంద్రబాబు తెలిపారు.

Next Story