కేసు విచారణకు వెళ్తూ ఇద్దరు పోలీసులు మృతి.. చంద్రబాబు ఎమోషనల్ ట్వీట్

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-06-26 14:50:17  IST  )

కేసు విచారణకు వెళ్తూ ఇద్దరు పోలీసులు మృతి చెందడం బాధాకరమని సీఎం చంద్రబాబు ఎమోషనల్ ట్వీట్ చేశారు..

కేసు విచారణకు వెళ్తూ ఇద్దరు పోలీసులు మృతి.. చంద్రబాబు ఎమోషనల్ ట్వీట్
X

దిశ, వెబ్ డెస్క్: కేసు విచారణలో భాగంగా నిందితుల కోసం కారులో హైదరాబాద్ వెళ్తున్న ఏపీ పోలీసులు(AP Police) కోదాడ వద్ద రోడ్డు ప్రమాదానికి గురికావడం విషాదకరమని సీఎం చంద్రబాబు నాయుడు(CM Chandrababu Naidu) అన్నారు. ఈ ప్రమాదంలో అంబేద్కర్ కోనసీమ జిల్లా(Ambedkar Konaseema District) ఆలమూరు ఎస్సై ఎం. అశోక్, కానిస్టేబుల్ బ్లెస్సన్ జీవన్‌లు మరణించడం బాధాకరమని ఆయన తెలిపారు. వారి కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేస్తున్నానని, తీవ్రంగా గాయపడ్డ కానిస్టేబుల్ స్వామి, డ్రైవర్ రమేష్‌లకు అందుతున్న వైద్య సాయంపై అధికారులతో మాట్లాడానని పేర్కొన్నారు. విధి నిర్వహణలో మృతి చెందిన పోలీసుల కుటుంబాలకు, బాధితులకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉండాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చానని సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.

Next Story