- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దేశంలో పెద్దమొత్తంలో పింఛన్లు ఇస్తున్న రాష్ట్రం మనదే : సీఎం చంద్రబాబు
ప్రపంచంలో అతిపెద్ద డీబీటీ విధానం పింఛన్ల పంపిణీనే అని సీఎం చంద్రబాబు అన్నారు. గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మాన చర్చలో భాగంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: దేశంలో ఇంత పెద్దమొత్తంలో పింఛన్లు ఇస్తున్న రాష్ట్రం ఏపీనే అని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమై మూడు రోజులవ్వగా.. గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానం చర్చ రెండో రోజు కొనసాగుతోంది. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు గత ప్రభుత్వం చేసిన అరాచకాలను ఎండగట్టారు. కూటమి ప్రభుత్వ హయాంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమాలను గురించి ప్రస్తావించారు. ఏపీలో పింఛన్ల కోసం ఏటా రూ.34 వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని వివరించారు. ప్రపంచంలోనే అతిపెద్ద డీబీటీ (డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ ఫర్) కార్యక్రమం పింఛన్ల పంపిణీనేనని చెప్పారు. వెంటిలేటర్ పై ఉన్న రాష్ట్ర అభివృద్ధికి సహాయం అందించిన కేంద్రానికి అభినందనలు తెలిపారు. కేంద్రం మద్దతు వల్లనే రాష్ట్రం కోలుకుంటోందని, హామీల అమలుకు కూడా కేంద్రం బాధ్యత తీసుకుందని సీఎం పేర్కొన్నారు.
నాకు జరిగిన అవమానానికి కన్నీళ్లు పెట్టుకున్నా
గత ప్రభుత్వం రాష్ట్రంలో అనేక విధ్వంసాలు చేసిందని, వాటిపై ఏడు శ్వేతపత్రాలు విడుదల చేశామని తెలిపారు. 2019-24 మధ్యలో రాష్ట్రంలో జరిగిన విధ్వంసాలకు లెక్కే లేదన్నారు. అసెంబ్లీలో తనకు జరిగిన అవమానానికి కన్నీళ్లు పెట్టుకున్నానని గుర్తుచేసుకున్నారు. ఐదేళ్ల అరాచక పాలనలో తనలా కన్నీరు పెట్టుకున్నవారు ఎంతోమంది ఉన్నారని సీఎం చెప్పారు.
ఇంటింటా సోలార్ విద్యుత్ తయారీ
టెక్నాలజీని సరిగ్గా వాడుకుంటే రాష్ట్ర అభివృద్ధిలో అద్భుతాలు సృష్టించవచ్చన్నారు. అందరూ శ్రద్ధగా పనిచేస్తే పీ4 దేశంలోనే ఆదర్శంగా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రూ. 4 లక్షల కోట్లు ఖర్చుపెట్టి గ్రీన్ ఎనర్జీకోసం ప్రత్యేక గ్రిడ్ వేద్దామని కేంద్రమంత్రి అమిత్ షా ప్రతిపాదించినట్లు అసెంబ్లీ వేదికగా తెలిపారు. ప్రతి ఇల్లు సోలార్ విద్యుత్ ను తయారు చేసేలా ప్రజా ప్రతినిధుల ప్రోత్సహించాలని సూచించారు.
ప్రతీ ఒక్కరికి ఏఐ డాక్టర్
అలాగే త్వరలోనే ప్రతీ ఒక్కరికీ ఏఐ డాక్టర్ ను కేటాయిస్తామని, ఏం తినాలో ఏం చేయాలో ఏఐ డాక్టర్ చెబుతుందన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఐటీ కారిడార్ డెవలప్ అవ్వాలన్నారు. విశాఖలో 15 బిలియన్ల పెట్టుబడితో గూగుల్ డేటా సెంటర్ ను ఏర్పాటు చేస్తుండగా.. గూగుల్ రాకతో కాగ్నిజెంట్, టీసీఎస్ కూడా విశాఖకు వచ్చాయన్నారు. రాయలసీమకు నీళ్లిచ్చి రతనాల సీమగా మారుస్తామని, గోదావరి జిల్లాలకంటే సస్యశ్యామలంగా తీర్చిదుద్దుతామని తెలిపారు. ప్రతీ ఒక్కరి భూమికి భద్రత ఇచ్చే బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందన్నారు.






