రాష్ట్రంలో చెత్త రాజకీయాలను కడిగేస్తా.. సీఎం చంద్రబాబు మాస్ వార్నింగ్

by Kema Shiva Kumar |

ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh)లో చెత్త రాజకీయాలను కడిగేస్తానని సీఎం చంద్రబాబు (CM Chandrababu Naidu) అన్నారు.

రాష్ట్రంలో చెత్త రాజకీయాలను కడిగేస్తా.. సీఎం చంద్రబాబు మాస్ వార్నింగ్
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh)లో చెత్త రాజకీయాలను కడిగేస్తానని సీఎం చంద్రబాబు (CM Chandrababu Naidu) అన్నారు. ఇవాళ మాచర్ల (Macharla)లో సర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. మాచర్లలో చాలాకాలం ప్రజాస్వామ్యం లేకుండాపోయిందని అన్నారు. కొందరు నేతలు రౌడీయిజంతో విధ్వంసం చేశారని కామెంట్ చేశారు. నియోజకవర్గంలో చాలా అరాచకాలు జరిగాయని.. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా టీడీపీ (TDP) నేతలు, కార్యకర్తలపై దాడి చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

తాము అధికారంలోకి రాగానే రాయసీమలో ఫ్యాక్షనిజం (Factionalism) లేకుండా చేశానని అన్నారు. ఇక నుంచి పల్నాడు (Palnadu)లో రౌడీయిజం చేస్తే ఊరుకునేది లేదని మాస్ వార్నింగ్ ఇచ్చారు. తాను 2014 నాటి సీఎంను కాదని.. 1995 నాటి సీఎంను అంటూ హెచ్చరించారు. గత ప్రభుత్వం చెత్త మీద కూడా పన్ను వేసిందని.. చెత్తను కూడా తొలగించలేదని అన్నారు. తాము అధికారంలోకి వస్తూనే చెత్త మీద పన్ను తొలగించామని.. చెత్తను లేకుండా చేశామని తెలిపారు. చెత్తను మాత్రమే కాదు.. రాబోయే రోజుల్లో చెత్త రాజకీయాలను కూడా కడిగేస్తానని సీఎం చంద్రబాబు కామెంట్ చేశారు.

Next Story