మాచర్ల అత్యాచార ఘటన.. పోలీసులకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు

by Naga Rani Yarlagadda |

మాచర్ల అత్యాచార ఘటనపై సీఎం చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. నిందితులెవరైనా సరే కఠినంగా శిక్షించాలని ఆదేశించారు.

మాచర్ల అత్యాచార ఘటన.. పోలీసులకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
X

దిశ, వెబ్‌డెస్క్: మాచర్లలో రెండ్రోజుల క్రితం ప్రభుత్వ ఉద్యోగినిపై జరిగిన అత్యాచార ఘటనపై సీఎం చంద్రబాబు నాయుడు సీరియస్ గా స్పందించారు. నిందితుడిని వీలైనంత త్వరగా అరెస్ట్ చేయాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ కేసు వివరాలను సీఎం అడిగి తెలుసుకున్నారు. పంచాయతీరాజ్ శాఖలో కార్యాలయ సబార్డినేట్ గా పనిచేస్తున్న మహిళ ఇంటిలోకి ఒక అగంతకుడు చొరబడి అత్యాచార యత్నానికి పాల్పడినట్లు అధికారులు వెల్లడించారు. ఫిర్యాదు అందిన వెంటనే కేసు నమోదు చేసి.. బాధితురాలిని వైద్య పరీక్షల కోసం గుంటూరు జీజీహెచ్ కు తరలించినట్లు వివరించారు. అడిషినల్ ఎస్పీ నేతృత్వంలో నిందితుడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు పోలీసు అధికారులు సీఎంకు తెలిపారు. ఈ ఘటనపై కొందరు అనుమానితుల్ని కూడా అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. మహిళలపై నేరాలకు పాల్పడేవారిని ఎట్టిపరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు.

Next Story