రైతులకు గుడ్ న్యూస్.. సకాలంలో రుణాలు, ఇన్పుట్ సబ్సిడీలు..!

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-08-26 10:41:17  IST  )

రైతులకు మరిన్ని సేవలు అందించేందుకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అడుగులు వేస్తున్నారు...

రైతులకు గుడ్ న్యూస్.. సకాలంలో రుణాలు, ఇన్పుట్ సబ్సిడీలు..!
X

దిశ వెబ్ డెస్క్: రైతుల(Farmers)కు మరిన్ని సేవలు అందించేందుకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు(Ap Cm Chandrababu) అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే ఎన్నో పథకాలు ప్రవేశపెట్టిన ఆయన తాజాగా మరో పథకాన్ని అమలు చేసే దిశగా కసరత్తులు చేస్తున్నారు. 'వన్ ఫ్యామిలీ-వన్ ఎంట్రప్రెన్యూర్'(One Family-One Entrepreneur) పథకంపై బ్యాంకుల సహకారం తీసుకోనున్నారు. ఇందులో భాగంగా బ్యాంకర్లతో మంగళవారం సమావేశం నిర్వహించారు. 'వన్ ఫ్యామిలీ-వన్ ఎంట్రప్రెన్యూర్' పథకానికి బ్యాంకుల సహకారంపై చర్చించారు.


ఈ సందర్భంగా బ్యాంకులు, ప్రజల మధ్య సంబంధంపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజలను నియంత్రించేలా బ్యాంకులు, ప్రభుత్వ విధానాలు ఉండకూడదని సూచించారు. రైతులకు రుణాలు, ఇన్పుట్ సబ్సిడీలను సకాలంలో అందించాలని, సంస్కరణల దిశగా ప్రజలను ప్రోత్సహించాలని బ్యాంకర్లను కోరారు. రైతులు, ప్రజలు, ప్రభుత్వ ఆకాంక్షలకు అనుగుణంగా బ్యాంకులు నిర్ణయాలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు.

Next Story