మేము సిద్ధం.. మీరూ రండి: జగన్‌కు మంత్రి కందుల సవాల్

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-11-13 14:31:24  IST  )

రాష్ట్రంలో సీఎం చంద్రబాబు చేతులు మీదుగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నారు...

మేము సిద్ధం.. మీరూ రండి: జగన్‌కు మంత్రి కందుల సవాల్
X

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో సీఎం చంద్రబాబు(Cm Chandrababu) చేతులు మీదుగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నారు. పేదల కోసం నిర్మించిన 3 లక్షల ఇళ్లకు బుధవారం గృహ ప్రవేశాలు నిర్వహించారు. ఇద్దరు లబ్ధిదారులతో కలిసి చంద్రబాబు సైతం గృహ ప్రవేశాల కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే ఆ గృహాలు తమ హయాంలో ప్రారంభమయ్యాయని వైసీపీ(Ycp) నేతలు ఆరోపిస్తున్నారు. అంతేకాదు సీఎం చంద్రబాబు నాయుడు క్రెడిట్ చోర్ చేస్తున్నారంటూ విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ నేతల విమర్శలకు మంత్రి కందుల దుర్గేశ్(Minister Kandula Durgesh) స్ట్రాంగ్ కౌంటర్ ఇ,చ్చారు. క్రెడిట్‌ చోరీపై జగన్‌తో చర్చకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. CII సమ్మిట్‌లో కీలక ఎంవోయూలు జరగబోతున్నాయని తెలిపారు. బడ్జెట్‌ ఫ్రెండ్లీ టూరిజంపై దృష్టి పెట్టామని మంత్రి కందుల దుర్గేశ్ పేర్కొన్నారు.

Next Story