- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నేడు ఢిల్లీకి సీఎం చంద్రబాబు..కారణం ఇదే
చంద్రబాబు నాయుడు ఢిల్లీ టూర్ ఖరారు అయింది. మొన్న మంత్రి నారా లోకేష్ ఢిల్లీకి వెళ్ళగా, ఇవాళ రాత్రి సీఎం చంద్రబాబు

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ టూర్ ఖరారు అయింది. మొన్న మంత్రి నారా లోకేష్ ఢిల్లీకి వెళ్ళగా, ఇవాళ రాత్రి సీఎం చంద్రబాబు నాయుడు కూడా బయలుదేరనున్నారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లా కలెక్టర్ల సదస్సు ఉండనుంది. ఈ కార్యక్రమం పూర్తయిన తర్వాత, ఇవాళ రాత్రి వరకు ఢిల్లీకి బయలుదేరుతారు సీఎం చంద్రబాబు నాయుడు. ఇక రేపు జల్ శక్తి మంత్రి సీఆర్ పాటిల్, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్, పెట్రోలియం, సహజ వాయువుల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి లాంటి కేంద్ర మంత్రులతో చంద్రబాబు నాయుడు విడివిడిగా సమావేశం కాబోతున్నారు.
ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధులు, ఇతర అంశాలపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కేంద్ర మంత్రులను సమావేశం అయిన తర్వాత చివరగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో కూడా చంద్రబాబు ప్రత్యేకంగా సమావేశం కానున్నారట. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై వీళ్ళ మధ్య చర్చ జరిగే ఛాన్స్ ఉందట. ఈ తరుణంలో చంద్రబాబు ఢిల్లీ పర్యటనకు అధికారులు అన్నీ ఏర్పాట్లు చేస్తున్నారు.






