- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నేడు ఆత్మకూరుకు సీఎం చంద్రబాబు.. అసలు విషయం ఇదే!
సీఎం చంద్రబాబు నాయుడు ఇవాళ నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరులో పర్యటించనున్నారు.

దిశ, వెబ్‌డెస్క్: సీఎం చంద్రబాబు నాయుడు ఇవాళ నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరులో పర్యటించనున్నారు. ఇవాళ ఉదయం 11.30 గంటలకు బాలికల గురుకుల పాఠశాల స్కూళ్లలో ఆవరణలోని హెలీప్యాడ్‌కు ఆయన చేరుకుంటారు. 11.50 గంటలకు నెల్లూరు పాలెం గిరిజన కాలనీలో NTR భరోసా పింఛన్ల పంపిణీ చేయనున్నారు. అనంతరం మేడేను పురస్కరించుకుని ఆంధ్ర ఇంజినీరింగ్ కళాశాల సమీపంలో భవన నిర్మాణ కార్మికులతో ముచ్చటిస్తారు.
మధ్యాహ్నం 12.35 గంటలకు నారంపేట MSME పార్కును ప్రత్యక్షంగా, వర్చువల్ విధానంలో రాష్ట్రంలోని 50 ఎంఎస్ఎంఈ పార్కులు ప్రారంభించనున్నారు. 1.30 గంటల నుంచి 3 గంటల వరకు ప్రజావేదికలో స్థానికులతో చంద్రబాబు ముఖాముఖి కార్యక్రమం నిర్వహించనున్నారు. 3.05 గంటల నుంచి 4.35 గంటల వరకు టిడ్కో సమీపంలో పార్టీ కార్యకర్తలతో సమావేశమవుతారు. అక్కడి నుంచి మళ్లీ హెలీప్యాడ్‌కు చేరుకుని విజయవాడకు చేరుకుంటారు. సీఎం చంద్రబాబు పర్యటన నేపథ్యంలో జిల్లా అధికారులు కట్టుదిట్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.






