- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాష్ట్రానికి రికార్డు పెట్టుబడులు.. సీఎం చంద్రబాబు కీలక రివ్యూ
ఏపీకి పెట్టుబడులను ఆకర్షించడమే కాకుండా, కుదుర్చుకున్న ఒప్పందాలన్నీ క్షేత్రస్థాయిలో కార్యరూపం దాల్చేలా సీఎం చంద్రబాబు దూకుడు పెంచారు. ..

దిశ, వెబ్ డెస్క్: ఏపీ(Ap)కి పెట్టుబడులను ఆకర్షించడమే కాకుండా, కుదుర్చుకున్న ఒప్పందాలన్నీ క్షేత్రస్థాయిలో కార్యరూపం దాల్చేలా సీఎం చంద్రబాబు(Cm Chandrababu) దూకుడు పెంచారు. భాగస్వామ్య సదస్సులో కుదిరిన ఎంఓయూలు, స్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ బోర్డ్ (SIPB) ఆమోదించిన ప్రాజెక్టుల పురోగతిపై మంత్రి నారా లోకేశ్(Minsiter Nara Lokesh) నేతృత్వంలోని మంత్రుల కమిటీ(Ministers Committy)తో ఆయన గురువారం ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతిని పరుగులు పెట్టించేందుకు, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా అధికారులకు, మంత్రులకు ఆయన దిశానిర్దేశం చేశారు.
282 ప్రాజెక్టులకు ప్రభుత్వం ఆమోదం
రాష్ట్ర చరిత్రలోనే అత్యంత భారీగా ఎస్‌ఐపీబీల ద్వారా ఇప్పటివరకు రూ.11.47 లక్షల కోట్ల పెట్టుబడులతో కూడిన 282 ప్రాజెక్టులకు ప్రభుత్వం ఆమోదం తెలిపిందని సీఎం చంద్రబాబు గుర్తు చేశారు. ఇందులో ఇప్పటికే 114 ప్రాజెక్టులు క్షేత్రస్థాయిలో పనులు ప్రారంభించుకున్నాయని ముఖ్యమంత్రికి లోకేశ్ వివరించారు. మిగిలిన ప్రాజెక్టులను కూడా వేగంగా పట్టాలెక్కించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను కమిటీ ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించింది.
త్వరగా సాకారం కావాలి
విశాఖ భాగస్వామ్య సదస్సులో వివిధ సంస్థలతో కుదుర్చుకున్న ప్రతి ఒప్పందం త్వరితగతిన సాకారం కావాలని ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన అనుమతులు, భూ కేటాయింపుల ప్రక్రియలో ఎలాంటి ఆలస్యం లేకుండా, యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలని ఆదేశించారు.






