ఉత్తరాంధ్రలో దంచికొడుతున్న వర్షాలు.. కలెక్టర్లకు సీఎం కీలక ఆదేశాలు

by Vemula.Srinu Prasad |

ఉత్తరాంధ్రలో కురుస్తున్న వర్షాలపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు..

ఉత్తరాంధ్రలో దంచికొడుతున్న వర్షాలు.. కలెక్టర్లకు సీఎం కీలక ఆదేశాలు
X

దిశ, వెబ్ డెస్క్: ఉత్తరాంధ్ర(Uttarandra)ను భారీ వర్షాలు(Heavy Rains) అతలాకుతలం చేస్తున్నాయి. విశాఖ(Visakha), శ్రీకాకుళం(Srikakulam), విజయనగరం(Vijayanagaram) జిల్లాల్లో ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వానలు కురుస్తున్నాయి. వర్షాలకు తోడు ఈదురుగాలులు కూడా ఆయా ప్రాంతాలపై విరుచుపడ్డాయి. దీంతో వాగులు, వంకలు, కుంటలు వర్షపు నీటితో పొంగిపొర్లుతున్నాయి. చాలా చోట్ల రోడ్లపై భారీ వృక్షాలు కూలిపోయాయి. పలు చోట్ల రోడ్లపై భారీగా వరద నీరు నిలిచిపోయాయి. విద్యుత్ స్తంభాలు కూలిపోవడంతో చాలా ప్రాంతాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయాయి. మరోవైపు ఉత్తరాంధ్రలోని నదులకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో నదులు ఉధృతంగా మారాయి. ఈ మేరకు పరివాహక ప్రాంతాలకు ముప్పు పొంచి ఉందని, పరిస్థితులు క్లిష్టంగానే ఉండే అవకాశాలున్నాయని అధికారుల అంచనా వేశారు.

ఈ విషయం తెలుసుకున్న సీఎం చంద్రబాబు నాయుడు(Cm Chandrababu Naidu) అత్యవసరంగా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అన్ని శాఖల అధికారులను సమన్వయం చేసుకుని వరద ప్రాంతాల్లో పని చేయాలని సూచించారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యాలు కలుగకుండా చూడాలని ఆదేశించారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా చూడాలని చెప్పారు. కొన్ని ప్రాంతాల్లో వరద ముప్పు దృష్యా అలర్ట్ గా ఉండాలని సూచించారు. కంట్రోల్ రూమ్ సేవలతో పాటు ప్రజలకు అధికారులు సైతం అందుబాటులో ఉండాలని స్పష్టం చేశారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు టీములు సిద్ధంగా ఉండాలని, అవసరమైతే ప్రజలను పునరావాసాలకు తరలించాలని కలెక్టర్లకు సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారు.

Next Story