- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అన్ని శాఖల అధికారులకు బిగ్ షాక్.. క్షేత్రస్థాయికి వెళ్లాల్సిందేనని సీఎం ఆదేశం
అన్ని శాఖల పని తీరు మెరుగు పరుచుకునేందుకు క్షేత్రస్థాయిలో పర్యటించాలని అధికారులను సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు....

దిశ, వెబ్ డెస్క్: అన్ని శాఖల పని తీరు మెరుగు పరుచుకునేందుకు క్షేత్రస్థాయిలో పర్యటించాలని అధికారులను సీఎం చంద్రబాబు నాయుడు(Cm Chandrababu Naidu) ఆదేశించారు. ఆర్టీజీఎస్, పబ్లిక్ పాజిటివ్ పర్షెప్సన్(RTGS, public positive perception)పై క్యాంపు కార్యాలయంలో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా వాట్సప్ మనమిత్ర సేవలు నూటికి నూరు శాతం ప్రజలందరూ వినియోగించుకునేలా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. వివిధ శాఖల సమర్ధత పెరిగేలా, మెరుగైన సేవలు అందించేలా అధికారులకు పలు సూచనలు చేసిన ఆయన ఈ నెల నుంచి కనీసం 80 శాతం నుంచి 90 శాతం తగ్గకుండా పబ్లిక్ పర్షెప్సన్ ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు.
295 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో...
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 295 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అవినీతి జరగకుండా చూడాలని ఆదేశించారు. వేట్లపాలెం పేలుళ్లను సమీక్షలో ప్రస్తావించిన ముఖ్యమంత్రి అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా రక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు. అవసరమైతే శివకాశీకి వెళ్లి అధ్యయనం చేయాలన్నారు. రాష్ట్రంలో వరుస ప్రమాదాలు, సంఘటనలపై అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ముందుగానే చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు.
లోటుపాట్లు ఉండొద్దు...
‘‘పెన్షన్ల పంపిణీలో లోటుపాట్లు ఉండకూడదు. అట్టడుగులో ఉన్న చోట సైతం పంపిణీ జరిగాలి. స్వర్ణ గ్రామాలు, స్వర్ణ వార్డులపై ప్రత్యేకంగా దృష్టి సారించాలి. దీపం పథకం గ్యాస్ సిలిండర్ల డెలివరీకి డబ్బులు వసూలు చేయొద్దు. ఎవరైనా అలా చేస్తే కఠినంగా వ్యవహరించండి. ఆర్టీసీ బస్సు సర్వీసులు బావున్నాయని ప్రజల నుంచి ఫీడ్ బ్యాక్ వచ్చింది. అయితే బస్ స్టేషన్‌లో సౌకర్యాలు, ఔట్ సోర్సింగ్ సర్వీసులను మెరుగుపర్చాలి. పుంగనూరు, వెంకటగిరి, పెనుకొండ, ప్రొద్దుటూరు, ఎమ్మిగనూరు, శ్రీకాళహస్తి బస్ స్టేషన్‌లో సౌకర్యాలు మెరుగుపర్చండి. తాగునీరు, టాయిలెట్స్, ఫ్యాన్స్, సీటింగ్ ఏరియాపై ప్రయాణికుల నుంచి అసంతృప్తి ఉంది. రాష్ట్రంలోని అన్ని బస్టేషన్‌లో మరమ్మతులు పూర్తి చేయండి. గమ్యస్థానం చేరే వరకు ప్రయాణం సౌకర్యవంతంగా ఉండాలి.’’ అని అధికారులను చంద్రబాబు ఆదేశించారు.






