- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పోర్టులు, ఎయిర్‌పోర్టులపై సీఎం ఫోకస్.. సరుకు రవాణాపై కీలక ఆదేశాలు
సరకు రవాణా నిర్వహణపై అధికారులకు సీఎం చంద్రబాబు నాయుడు కీలక ఆదేశాలు జారీ చేశారు...

దిశ, వెబ్ డెస్క్: సరకు రవాణా నిర్వహణ(Freight transport management)కు లాజిస్టిక్స్ కార్పొరేషన్(Logistics Corporation) ఏర్పాటు చేయాలని అధికారులను సీఎం చంద్రబాబు నాయుడు(CM Chandrababu) ఆదేశించారు. పోర్టులు, ఎయిర్ పోర్టులు, రహదారులు, రైలు, అంతర్గత జల రవాణా మార్గాలపై అమరావతి సచివాలయంలో ఆయన సమీక్ష నిర్వమించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ పోర్టులు, ఎయిర్ పోర్టులు, రహదారులు, రైలు, అంతర్గత జల రవాణా మార్గాల ద్వారా చేపట్టే సరకు రవాణాను ఈ కార్పొరేషన్ ద్వారానే నిర్వహించాలని ఆయన సూచించారు. సరుకు రవాణా మార్గాలకు కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ పని చేయాలని చెప్పారు. ఎకనమిక్ హబ్‌గా పోర్టులు-ఎయిర్ పోర్టులు తయారు కావాలని సూచించారు. షిప్ బిల్డింగ్ యూనిట్ల ఏర్పాటుకు చర్యలు చేపట్టాలన్నారు. మరిన్ని పెట్టుబడుల కోసం మారిటైం పాలసీలో మార్పులు తీసుకురావాలని చంద్రబాబు తెలిపారు.
రాష్ట్రంలో 20 పోర్టులు, మరిన్ని ఎయిర్ పోర్టుల నిర్మాణాలకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నట్లు ముఖ్యమంత్రి పేర్కొన్నారు., ఆపరేషనల్‌గా ఉన్న పోర్టులు, ఎయిర్ పోర్టుల నుంచి పెద్ద ఎత్తున కార్యకలాపాలు జరుగుతున్నాయని తెలిపారు. ప్రతి పోర్టు, ఎయిర్ పోర్టుల సమీప ప్రాంతాలను ఆర్ధిక కేంద్రాలుగా అభివృద్ధి చేయాలని సూచించారు. ఓడరేవులు, విమానాశ్రయాలకు అనుసంధానించేలా శాటిలైట్ టౌన్ షిప్పులను అభివృద్ధి చేయాలని చెప్పారు. అలాగే కొత్తగా మరిన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని, ఆర్థిక కార్యకలాపాలు పెరుగుతాయని చెప్పారు. తద్వారా సంపద సృష్టి జరుగుతుందని, ఈ తరహా సమీకృత అభివృద్ధి ఎక్కడెక్కడ చేయగలమో ఏ విధంగా చేయగలమనే అంశాలపై బ్లూ ప్రింట్ సిద్దం చేసుకోవాలని అధికారులకు సీఎం చంద్రబాబు సూచించారు.






