- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వేగం.. నాణ్యత రెండూ ఉండాల్సిందే: అధికారులకు చంద్రబాబు ఆదేశం
రాజధాని పనుల్లో వేగం, నాణ్యత ఉండాల్సిందేనని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు..

X
దిశ, వెబ్ డెస్క్: కూటమి ప్రభుత్వం(Kutami Government) అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి నిర్మాణ పనుల(Amaravati Works)ను పరుగులు పెట్టించిన విషయం తెలిసిందే. అయితే ఈ పనులు ఇప్పటివరకూ ఎంత వరకు వచ్చారు...?, కాంట్రాక్టర్లు ఎలా చేస్తున్నారు. పనుల్లో నాణ్యత ఉందా లేదా అనే అంశాలపై సీఎ చంద్రబాబు(Cm Cahandrababu) మరింత ఫోకస్ పెట్టారు. ఈ మేరకు అమరావతి నిర్మాణ పనులు చేస్తున్న కాంట్రాక్టర్లు, ఆయా సంస్థల యజమాన్యాలతోపాటు అధికారులను చంద్రబాబు మాట్లాడారు. పనుల పురోగతిపై ఆరా తీశారు. ఈ మేరకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు జారీ చేశారు. రాజధాని నిర్మాణ పనుల్లో నాణ్యత కచ్చితంగా పాటించాల్సిందేనని, వేగం కూడా మరింత పుంజుకోవాలని సూచించారు. అలాగే నిర్దేశించిన సమయానికల్లా రాజధాని పనులు పూర్తి కావాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.
Next Story






