పోలవరం పనులపై సీఎం ఫోకస్.. పూర్తిపై కీలక అప్ డేట్

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-01-07 10:17:36  IST  )

పోలవరం ప్రాజెక్టు ఫేజ్ -1 పనులను మార్చి 2027 నాటికి పూర్తి చేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు...

పోలవరం పనులపై సీఎం ఫోకస్.. పూర్తిపై కీలక అప్ డేట్
X

దిశ, వెబ్ డెస్క్: పోలవరం ప్రాజెక్టు(Polavaram project) ఫేజ్ -1 పనులను మార్చి 2027 నాటికి పూర్తి చేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు(CM Chandrababu Naidu) హామీ ఇచ్చారు. పోలవరం(Polavaram)లో పర్యటించిన ఆయన ప్రస్తుతం పోలవరం ఫేజ్-1 పనులు జరుగుతున్నాయని చెప్పారు. ఆ తర్వాత ఫేజ్-2 పనులపై దృష్టి పెడతామని చెప్పారు. ప్రస్తుతానికి ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ ప్రక్రియను పూర్తి చేస్తున్నామని తెలిపారు. పోలవరం విషయంలో జగన్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని గుర్తు చేశారు. 2019లోనూ తామే గెలిచి ఉంటే పోలవరం ఈపాటికే పూర్తి అయి ఉండేదన్నారు. గత ఐదేళ్లలో కనీసం డయా‌ఫ్రమ్‌వాల్‌ను కూడా జగన్ ప్రభుత్వం కాపాడలేకపోయిందని విమర్శించారు. తాము మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాత పోలవరం డయా ఫ్రమ్ వాల్ నిర్మాణం చేపట్టామని, అనుకున్న సమయం కంటే ముందుగా పూర్తి చేస్తామని సీఎం చంద్రబాబు దీమా వ్యక్తం చేశారు.

Next Story