ఫెర్రో అల్లాయ్స్ పరిశ్రమలకు గుడ్ న్యూస్.. సీఎం చంద్రబాబు కీలక ప్రకటన

by Vemula.Srinu Prasad |

ఫెర్రో అల్లాయ్స్ పరిశ్రమలకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్ తెలిపారు...

ఫెర్రో అల్లాయ్స్ పరిశ్రమలకు గుడ్ న్యూస్.. సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
X

దిశ, వెడ్ డెస్క్: రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్‌కు అనుగుణంగా నాణ్యమైన విద్యుత్(Power) సరఫరా జరగాలని సీఎం చంద్రబాబు(Cm Chandrababu) అన్నారు. విద్యుత్ సరఫరా, పీఎం కుసుమ్, సోలార్ రూఫ్ టాప్, విద్యుత్ ఉత్పత్తి, పంపిణీలో వ్యయం తగ్గింపు తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ ట్రాన్స్ మిషన్ నష్టాలను గణనీయంగా తగ్గించేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. విద్యుత్ కొనుగోళ్ల భారం తగ్గించుకునేందుకు ఇతర రాష్ట్రాలతో పవర్ స్వాపింగ్ ఎంఓయూలు కుదుర్చుకోవాలని సూచించారు. రాష్ట్రంలో పీఎం కుసుమ్ సహా సోలార్ రూఫ్ టాప్ ప్రాజెక్టులు వేగంగా అమలు కావాలని ఆదేశించారు. ఒప్పందాలు చేసుకున్న ప్రాజెక్టులు 60 రోజుల్లో తమ కార్యాచరణ ప్రారంభించేలా చూడాలని స్పష్టం చేశారు. ఫెర్రో అల్లాయ్స్ పరిశ్రమల(Ferro alloys industries)కు మరో ఏడాది ప్రోత్సాహకాలు కొనసాగించాలన్నారు. థర్మల్ పవర్ స్టేషన్లలోని బూడిదను వివిధ అవసరాలకు సద్వినియోగం చేసుకునే అంశాన్ని పరిశీలించాలని సూచించారు.

ప్రభుత్వ భవనాలపై సౌర విద్యుత్ ప్రాజెక్టులను చేపట్టేలా చర్యలు తీసుకోవాలని విద్యుత్ శాఖను ఆదేశించారు. ప్రభుత్వ శాఖలతో పాటు ప్రజల్లోనూ విద్యుత్ పొదుపుపై అవగాహనా కార్యక్రమాలు చేపట్టాలని చెప్పారు. విద్యుత్ పొదుపు ఉపకరణాలు వినియోగించేలా కార్యాచరణ చేపట్టాలని సీఎం పేర్కొన్నారు. అసమర్ధ నిర్ణయాలతో విద్యుత్ రంగాన్ని గత పాలకులు అస్తవ్యస్తం చేశారని వ్యాఖ్యానించారు. పీపీఏల రద్దు నిర్ణయంతో రూ.9 వేల కోట్ల భారాన్ని వైసీపీ సర్కారు ప్రజలపై మోపిందని చెప్పారు. విద్యుత్ వినియోగించకుండానే రూ.9 వేల కోట్ల ప్రజాధనాన్ని కంపెనీలకు చెల్లించేసిందని సీఎం చంద్రబాబు తెలిపారు.

Next Story