నంద్యాల ప్రజలకు సీఎం గుడ్ న్యూస్... హంద్రీనీవా తాగునీరు ఇచ్చేందుకు చర్యలు

by Vemula.Srinu Prasad |

నంద్యాల జిల్లా ప్రజలకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్ తెలిపారు. హంద్రీనీవా నుంచి తాగు నీరు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు...

నంద్యాల ప్రజలకు సీఎం గుడ్ న్యూస్... హంద్రీనీవా తాగునీరు ఇచ్చేందుకు చర్యలు
X

దిశ, వెబ్ డెస్క్: నంద్యాల జిల్లా(Nandyala District) ప్రజల(People)కు సీఎం చంద్రబాబు(Cm Chandrababu) గుడ్ న్యూస్ తెలిపారు. హంద్రీనీవా(Handreeniva) నుంచి తాగు నీరు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. నంద్యాల జిల్లా కొత్తబురుజు సభ(Kothaburuju Sabha)లో చంద్రబాబు ప్రసంగించారు. హంద్రీనీవా ద్వారా కుప్పానికి(Kuppam) సైతం నీళ్లు ఇచ్చామని గుర్తు చేశారు. రాయలసీమ(Rayalaseema)లోని ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వాలన్నదే తన సంకల్పమని చెప్పారు. తిరుమల లడ్డూ వ్యవహారంపై సీబీఐ ఇచ్చిన రిపోర్టుపైనా తప్పుడు ప్రచారం చేస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. శ్రీవారికి అపచారం చేయాలని చూశారని, కానీ తాను చూస్తూ ఊరుకోనని హెచ్చరించారు. మత విద్వేషాలనూ రెచ్చగొట్టాలని చూస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే తిరుమల నుంచే ప్రక్షాళన మొదలుపెట్టామని చెప్పారు. గత ప్రభుత్వం తిరుమల పవిత్రతను దెబ్బతీసే ప్రయత్నం చేసిందన్నారు. ఇందులో భాగంగానే శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ పాల్పడ్డారని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో కల్తీ మద్యం తయారు చేసి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడారని సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Next Story