- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Ap Cm: మరో హామీ అమలు చేసిన చంద్రబాబు
మరో హామీని సీఎం చంద్రబాబు నాయుడు అమలు చేశారు...

దిశ, వెబ్ డెస్క్: మరో హామీని సీఎం చంద్రబాబు నాయుడు(CM Chandrababu Naidu) అమలు చేశారు. ఎన్నికల ముందు తాము అధికారంలోకి వస్తే వేట నిషేధ సమయంలో మత్స్యకారుల(Fishermen)కు ఒక్కొక్కరికి రూ. 20 వేల అందజేస్తామని హామీ ఇచ్చారు. తాజాగా చేపల వేట నిషేధంతో ఆ డబ్బులను మత్య్సకారుల ఖాతాల్లో జమ చేశారు. ఈ రోజు శ్రీకాకుళం జిల్లా బుడగట్లపాలెం(Budagatla palem)లో మత్య్సకారుల సేవలో సేరుతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. 32 శాతం మత్య్ససంపద రాష్ట్రం నుంచి ఎగుమతులు నిర్వహిస్తున్నారని, తద్వారా 16.50 లక్షల మందికి ఉపాధి దొరుకుతోందని తెలిపారు. చేపలు తింటే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని చెప్పారు. మత్య్సకారుల పిల్లల చదువుల బాధ్యతను తమ ప్రభుత్వం తీసుకుంటుందని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇప్పటికే ఆరు రెసిడెన్షియల్ స్కూళ్లను ఏర్పాటు చేశామన్నారు. ఎచ్చెర్ల(Etcherla)లో నైపుణ్య శిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. స్థానికులే ఉద్యోగావకాశాలు కల్పిస్తామని చెప్పారు. రాష్ట్రంలో పేదలకు రూ. 33 వేల కోట్ల పింఛన్లు ఇస్తున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మాత్రమేనని చంద్రబాబు పేర్కొన్నారు. మత్స్యకారుల జీవన ప్రమాణాల మెరుగుకు ప్రణాళిక రూపొందిస్తామన్నారు.
రూ. 1990 కోట్లతో 9 షిప్పింగ్ హార్బర్ల నిర్మాణం చేపడుతున్నట్లు పేర్కొన్నారు. జగన్ ప్రభుత్వం విధ్వంసాలతో అభివృద్ధి నిలిచిపోయిందని, తమ ప్రభుత్వం కొనసాగి ఉంటే రూ. 7 లక్షల కోట్ల సంపద పెరిగి ఉండేదని చంద్రబాబు పేర్కొన్నారు. రూ. 50 వేల మేర ప్రజల తలసరి ఆదాయం పెరిగేదన్నారు. తలసరి ఆదాయంలో విశాఖ వాసులు రాష్ట్రంలో అగ్రస్థానంలో ఉన్నారని తెలిపారు. గతంలో మాజీ కేంద్ర మంత్రి ఎర్రన్నాయుడు ఉద్దానం ప్రాంతానికి నీళ్లు సాధించారని గుర్తు చేశారు. రామ్మోహన్ నాయుడు ఆధ్వర్యంలో భోగాపురం ఎయిర్ పోర్టు పూర్తికాబోతోందన్నారు. రాష్ట్రంలో 555 మత్స్యకారుల గ్రామాలున్నాయని, బుడగట్లపాలెం దశదిశ మార్చాలని ప్రజల కష్టాలు తెలుసుకునేందుకే తాను వచ్చినట్లు చంద్రబాబు పేర్కొన్నారు.
.






