వరుస వివాదాల్లో ఎమ్మెల్యేలు.. మళ్లీ వార్నింగ్ ఇచ్చిన సీఎం చంద్రబాబు

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-08-23 14:17:23  IST  )

వరుసగా ఎమ్మెల్యేలు వివాదాల్లో చిక్కుకోవడంపై సీఎం చంద్రబాబు నాయుడు ఫోకస్ పెట్టారు..

వరుస వివాదాల్లో ఎమ్మెల్యేలు.. మళ్లీ వార్నింగ్ ఇచ్చిన సీఎం చంద్రబాబు
X

దిశ, వెబ్ డెస్క్: వరుసగా ఎమ్మెల్యేలు వివాదాల్లో చిక్కుకోవడంపై సీఎం చంద్రబాబు నాయుడు(Cm Chandrababu Naidu) ఫోకస్ పెట్టారు. ఈ మేరకు కీలక నేతలతో అమరావతి(Amaravati)లో ఆయన భేటీ అయ్యారు. ఈ భేటీకి మంత్రులు, పొలిట్ బ్యూరో సభ్యులు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. అదుపుతప్పుతున్న ఎమ్మెల్యేలకు ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు వార్నింగ్ ఇచ్చారు. ఎమ్మెల్యేలు తీరు మార్చుకోవాలని, లేని పక్షంలో భవిష్యత్ ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. పార్టీ ఎమ్మెల్యేల పని తీరుపైనా మంత్రులకు సూచనలు చేశారు. ఎప్పటికప్పుడు పరిశీలన చేయాలని, పార్టీలో అందరినీ సమన్వయం చేసుకోవాలని ఆదేశించారు. అలాగే పార్టీలో సీనియర్లకు పదవులు, సంస్థాగత వ్యవహారాలతో పాటు పార్లమెంటరీ కమిటీలపైనా ఈ సమావేశంలో చర్చించారు. నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి, బలోపేతంపై పార్టీ నేతలకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.

Next Story