Cm Chandrababu: ఎమ్మెల్యే కందులపై సీరియస్.. స్ట్రాంగ్ వార్నింగ్

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-03-08 15:36:29  IST  )

మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డిపై సీఎం చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ..

Cm Chandrababu: ఎమ్మెల్యే కందులపై సీరియస్.. స్ట్రాంగ్ వార్నింగ్
X

దిశ, వెబ్ డెస్క్: మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి(MLA Kandula Narayana Reddy)పై సీఎం చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళా దినోత్సవం(Womens Day) సందర్భంగా ప్రకాశం జిల్లా మార్కాపురం(Markapuram)లో పర్యటించిన చంద్రబాబు.. ఎమ్మెల్యే పని తీరుపై అసహనం వ్యక్తం చేశారు. పార్టీని బలోపేతం చేయడంతో పాటు సభ్వత్వ నమోదులో చాలా వెనక్క బడ్డారని మండిపడ్డారు. అటు పార్టీ కార్యక్రమాల్లో కూడా పాల్గొనడం లేదని సీరియస్ అయ్యారు. జిల్లాలో మిగిలిన ఎమ్మెల్యేలతో పోల్చితే పని తీరులోనూ వెనకబడ్డారంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇకనైనా పని తీరు మెరుగుపర్చుకోవాలని, నియోజకవర్గంలో పార్టీ బలోపేతం కోసం కృషి చేయాలని సూచించారు. లేనిపక్షంలో పార్టీ తీసుకునే చర్యలకు బాధ్యతుడివి అవుతావంటూ ఎమ్మెల్యే కందులకు చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు.

కొన్ని రోజులగా కూటమి ఎమ్మెల్యేల పని తీరుపై సీఎం చంద్రబాబు సర్వే చేయిస్తున్నారు. అంతేకాదు పని తీరుకు నెంబర్లు కూడా కేటాయిస్తున్నారు. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకూ వెనకబడిన ఎమ్మెల్యేల లిస్టును కూడా ఇటీవల విడుదల చేశారు. ఆయనతో పాటు పవన్, లోకేశ్ వంటి నేతల నెంబర్ల లిస్టును కూడా రిలీజ్ చేశారు. వెనుకబడిన ఎమ్మెల్యేలు పని తీరు మార్చుకోవాలని.. పార్టీ బలోపేతంపై కృషి చేయాలని ఆదేశాలు జారీ చేశారు. అయితే కందుల నారాయణ రెడ్డి కూడా పని తీరులో వెనకబడ్డారని వచ్చింది. కానీ అందరితో పాటు సూచనలు చేశారు. తాజాగా మార్కాపురం పర్యటనకు వెళ్లిన ఆయనకు కందుల పని తీరుపై కింద స్థాయి టీడీపీ నేతలు, కార్యకర్తల నుంచి ఫిర్యాదు వెళ్లాయట. దీంతో ఈ రోజు స్వయంగా కందుల కలవడంతో చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. పని తీరు మెరుగు పరుచుకోవాలని హెచ్చరించారు. ఇకనైనా కందుల పని మారుతుందో చూడాలి.


Read Also..

మహిళా దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి నాదెండ్ల.. కీలక వ్యాఖ్యలు

‘రాష్ట్రంలో సూపర్ సిక్స్ అమలు చేస్తాం’.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Next Story