సీఎం చంద్రబాబు అసంతృప్తి.. మంత్రులకు క్లాస్

by Vemula.Srinu Prasad |

మంత్రుల పని తీరుపై సీఎం చంద్రబాబు నాయుడు అసంతృప్తి వ్యక్తం చేశారు. ...

సీఎం చంద్రబాబు అసంతృప్తి.. మంత్రులకు క్లాస్
X

దిశ, వెబ్ డెస్క్: మంత్రుల పని తీరుపై సీఎం చంద్రబాబు నాయుడు(Cm Chandrababu Naidu) అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో వారికి క్లాస్ తీసుకున్నారు. మంత్రులంటే కేవలం పాలసీలు తయారు చేయడమే కాదన్నారు. అలాగే సేవలంటే పాలసీలు మాత్రమే కాదని తెలిపారు. జనాభా పెరుగుదలకు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని మంత్రులకు సూచించారు. గర్భనిరోధక శస్త్ర చికిత్సలను నియమంత్రించాలని, సహజ పద్ధతుల్లోనే ప్రసవాలు జరిగేలా అవగాహన పెంచి ప్రభుత్వానికి సహకారం అందించాలని చెప్పారు. పాపులేషన్ మేనేజ్ మెంట్‌పై అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో పాలసీ ప్రకటిస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. జనాభా పెరుగుదలకు అవసరమైన ప్రోత్సాహకాలు సైతం ప్రకటిస్తామన్నారు. ఏప్రిల్ 1 నుంచి పాలసీ అమలుయ్యేలా ప్రణాళికలు రూపొందిస్తామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.

Next Story