- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆశాభోస్లే అస్తమయం.. సీఎం చంద్రబాబు సంతాపం
ప్రముఖ గాయని ఆశాభోస్లే మృతి పట్ల సీఎం చంద్రబాబు నాయుడు సంతాపం తెలిపారు.

దిశ, వెబ్‌డెస్క్ : ప్రముఖ గాయని, లతా మంగేష్కర్ సోదరి అయిన ఆశాభోస్లే (92) అనారోగ్య సమస్యలతో ఆదివారం ఉదయం కన్నుమూశారు. ఆమె మృతిపట్ల సీఎం చంద్రబాబు నాయుడు సంతాపం వ్యక్తం చేశారు. ఆశాభోస్లే మరణవార్త తనను తీవ్రంగా కలచివేసిందని, సోషల్ మీడియా వేదికగా దిగ్భ్రాంతి చెందారు. ఆశా భోస్లేజీ ఇక లేరన్న వార్త తెలిసి బాధకు గురయ్యానని పోస్టులో పేర్కొన్నారు. సంగీత ప్రపంచంలో ఆమె ఒక దిగ్గజమని, ఆమెలాంటి విలక్షణమైన, వైవిధ్యమైన గాయని మరొకరు లేరంటే అతిశయోక్తి కాదన్నారు. ప్రపంచంలో అత్యధిక పాటలు పాడిన కళాకారిణిగా చరిత్రలో నిలిచిపోయిన ఆమె కీర్తి అజరామరమని చంద్రబాబు కొనియాడారు. ఏడు దశాబ్దాలకు పైగా సాగిన ఆమె సంగీత ప్రస్థానం అసాధారణమైనదని, ఆమె పాడిన పాటలు ఎన్నో తరాలను ఉర్రూతలూగించాయని, అందరి జీవితాల్లో భాగమయ్యాయని చెప్పుకొచ్చారు. ఆమె గాత్రంలో ఉన్న మాధుర్యం, భావం ఎప్పటికీ మరపురానివన్నారు. పద్మవిభూషణ్ కూడా ఆమె ప్రతిభకు చిన్న గుర్తింపు మాత్రమేనన్నారు.






