- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చారిత్రక మైలురాయిని అధిగమించిన సీఎం చంద్రబాబు నాయుడు
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, నవ్యాంధ్రప్రదేశ్ సీఎంగా నారా చంద్రబాబు నాయుడు చారిత్రక మైలురాయిని అధిగమించారు.

దిశ, వెబ్‌డెస్క్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, నవ్యాంధ్రప్రదేశ్ సీఎంగా నారా చంద్రబాబు నాయుడు చారిత్రక మైలురాయిని అధిగమించారు. సాధారణ కుటుంబంలో పుట్టి.. రాజకీయంగా సొంతకాళ్లపై ఎదిగి, ముఖ్యమంత్రిగా 15 సంవత్సరాలు (అక్టోబర్ 10కి) పూర్తి చేసుకున్న వ్యక్తిగా నిలిచారు. దక్షిణాదిలో ఈ ఘనత సాధించిన రాజకీయ నాయకుల్లో మూడో వ్యక్తిగా ఉన్నారు. తమిళనాడు మాజీ సీఎం కరుణానిధి, పుదుచ్చేరి సీఎం ఎన్. రంగస్వామి రికార్డును అందుకున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు అత్యధిక కాలం సీఎంగా పనిచేసిన ఘనత కూడా ఆయనకే దక్కింది.
1995 సెప్టెంబర్ 1న తొలిసారి ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించారు. ఉమ్మడి రాష్ట్రానికి 8 సంవత్సరాల 255 రోజులు సీఎంగా సేవలు అందించారు. అలాగే నవ్యాంధ్రప్రదేశ్ సీఎంగా 6 సంవత్సరాల 110 రోజులు పూర్తిచేసుకుని.. మొత్తం 15 సంవత్సరాలపాటు సీఎంగా పనిచేసిన ఘనతను సాధించారు. ఉమ్మడిపాలనలో హైదరాబాద్ ను ఐటీ హబ్ గా మార్చేందుకు హైటెక్ సిటీకి పునాది వేశారు. దానితోపాటు విద్యుత్ రంగంలో తీసుకొచ్చిన మార్పులు, ఇంజనీరింగ్ విద్యను ప్రోత్సహించడం వంటి నిర్ణయాలు అద్భుతమైన ఫలితాలను ఇచ్చాయి.






