- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జస్టిస్ సూర్యకాంత్ కు సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు
భారత అత్యున్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్ (Justice Suryakant) ప్రమాణ స్వీకారం చేశారు.

దిశ, వెబ్ డెస్క్ : భారత అత్యున్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్ (Justice Suryakant) ప్రమాణ స్వీకారం చేశారు. వారికి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలను తెలియజేశారు. 53వ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలను స్వీకరించిన సందర్భంగా వారు తమ పదవీ కాలాన్ని విజయవంతంగా, ఆదర్శప్రాయంగా పూర్తి చేయాలని సీఎం ఆకాంక్షించారు. అదే విధంగా న్యాయ వ్యవస్థను పటిష్టపరచాలని, రాజ్యాంగ విలువలను కాపాడాలని కోరారు.
మంత్రి నారా లోకేష్..
ఏపీ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కూడా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ కు శుభాకాంక్షలను తెలియజేశారు. వారు అనిర్వచనీయమైన సేవలు, రాజ్యాంగ విలువల పట్ల అంకితభావం, అద్భుతమైన జుడీషియల్ రికార్డు అందరికీ న్యాయం చేయడంలో సుప్రీంకోర్టును అత్యున్నత స్థానంలో నిలుపుతుందని విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.






