చెస్ చాంపియన్ లకు సీఎం చంద్రబాబు అభినందనలు

by Thanuru Gopichand |   (  Updated:2025-12-29 06:18:19  IST  )

ఫిడే వరల్డ్ రాపిడ్ చెస్ ఛాంపియన్‌షిప్‌లో (FIDE World Rapid Chess Championship) కాంస్య పతకాలు సాధించిన తెలుగు తేజాలు అర్జున్ ఎరిగైసి, కోనేరు హంపిలను ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు మనస్ఫూర్తిగా అభినందించారు.

చెస్ చాంపియన్ లకు సీఎం చంద్రబాబు అభినందనలు
X

దిశ, వెబ్ డెస్క్ : ఫిడే వరల్డ్ రాపిడ్ చెస్ ఛాంపియన్‌షిప్‌లో (FIDE World Rapid Chess Championship) కాంస్య పతకాలు సాధించిన తెలుగు తేజాలు అర్జున్ ఎరిగైసి, కోనేరు హంపిలను ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు మనస్ఫూర్తిగా అభినందించారు. దోహా వేదికగా జరిగిన ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో అర్జున్ ఎరిగైసి ప్రదర్శించిన నైపుణ్యాన్ని కొనియాడారు. దిగ్గజ క్రీడాకారుడు విశ్వనాథన్ ఆనంద్ తర్వాత ఈ ఘనత సాధించిన ఏకైక భారతీయ పురుష క్రీడాకారుడు అర్జున్ (Arjun Erigaisi) అని సీఎం ప్రశంసించారు. తెలంగాణ ముద్దుబిడ్డగా అర్జున్ సాధించిన ఈ విజయం భారత చెస్ చరిత్రలో ఒక నూతన అధ్యాయాన్ని లిఖించిందని, ఇది దేశానికే గర్వకారణమని ఆయన పేర్కొన్నారు.

​మరోవైపు మహిళల విభాగంలో కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్న గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపిని (Koneru Hampi) కూడా సీఎం చంద్రబాబు నాయుడు అభినందనలతో ముంచెత్తారు. ఛాంపియన్లు అంటే ఒక్క విజయంతో ముగిసిపోయేవారు కాదని, అత్యున్నత స్థాయి పోటీల్లో నిలకడగా రాణించే సాహసం గలవారని హంపిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అంతర్జాతీయ వేదికపై ఆమె కనబరుస్తున్న అంకితభావం, నిలకడ, ప్రతిభ కోట్లాది మందికి స్ఫూర్తిదాయకమని సీఎం తెలిపారు. తెలుగు రాష్ట్రాల కీర్తిని దశదిశలా చాటుతున్న ఈ ఇద్దరు మేధావులు భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆయన ఆకాంక్షించారు.

Next Story