Polavaram: పోలవరానికి సీఎం చంద్రబాబు.. ఏరియల్ సర్వే

by Thanuru Gopichand |   (  Updated:2025-03-27 07:19:59  IST  )

పోలవరం ప్రాజెక్ట్ పనులను పరిశీలించేందుకు గురువారం పోలవరం చేరుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కు రాష్ట్రమంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు ఘన స్వాగతం పలికారు.

Polavaram: పోలవరానికి సీఎం చంద్రబాబు.. ఏరియల్ సర్వే
X

దిశ, డైనమిక్ బ్యూరో: పోలవరం ప్రాజెక్ట్ పనులను పరిశీలించేందుకు గురువారం పోలవరం చేరుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కు రాష్ట్రమంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు ఘన స్వాగతం పలికారు. గురువారం మధ్యాహ్నం 12.10 ని. లకు హెలికాప్టర్ ద్వారా పోలవరం చేరుకున్న ముఖ్యమంత్రి ముందుగా ఏరియల్ సర్వే ద్వారా ప్రాజెక్ట్ పనులను పరిశీలించారు. ముఖ్యమంత్రికి రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి, జిల్లా ఇంచార్జి మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్, రాష్ట్ర జలవనరుల శాఖా మంత్రి డా. నిమ్మల రామానాయుడు, రాష్ట్ర మంత్రులు కొలుసు పార్థసారధి పుష్పగుచ్చం అందించి స్వాగతం పలికారు.

పోలవరం ప్రాజెక్టును 2027 డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సాగునీటి శాఖ మంత్రిమంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పోలవరం ప్రాజెక్టు సందర్శనకు రానున్న నేపథ్యంలో సాగునీటి శాఖ మంత్రిమంత్రి నిమ్మల రామానాయుడు పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. చెప్పారు. 2026 నాటికి నిర్వాసితులకు అన్ని కాలనీలను నిర్మించి ఇస్తామని పేర్కొన్నారు. గత వైసీపీ ప్రభుత్వం పోలవరాన్ని ఏమాత్రం పట్టించుకోలేదని ఆయన ఆరోపించారు.

Next Story