విశాఖ ఉక్కుకంటే పెద్ద ఫ్యాక్టరీ.. స్టీల్ సిటీకి ఫౌండేషన్ : సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

by Ramesh Naini |

ఇది స్టీల్ ప్లాంట్‌కు శంకుస్థాపన కాదు.. స్టీల్ సిటీకి ఫౌండేషన్ అని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు.

విశాఖ ఉక్కుకంటే పెద్ద ఫ్యాక్టరీ.. స్టీల్ సిటీకి ఫౌండేషన్ : సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఇది స్టీల్ ప్లాంట్‌కు శంకుస్థాపన కాదు.. స్టీల్ సిటీకి ఫౌండేషన్ అని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. సోమవారం అనకాపల్లి జిల్లా నక్కలపల్లి మండలం రాజయ్యపేటలో ప్రపంచంలోనే అగ్రగామి స్టీల్‌ కంపెనీ ఆర్సెలార్‌ మిట్టల్‌, నిప్పాన్‌ స్టీల్‌ ఇండియా (ఏఎన్‌ఎంసీ) ఉక్కు కర్మాగారానికి కేంద్ర మంత్రులతో కలిసి, ముఖ్యమంత్రి చంద్రబాబు భూమి పూజ చేశారు. శంకుస్థాపన అనంతరం ఏర్పాటు చేసిన సభలో సీఎం చంద్రబాబు ప్రసంగించారు. ఇది దేశంలోనే అతిపెద్ద స్టీల్ ప్లాంట్ కాబోతోందని హర్షం వ్యక్తం చేశారు. స్టీల్ ప్లాంట్ ఏర్పాటుతో ఈ ప్రాంతం రూపురేఖలు మారబోతున్నాయని తెలిపారు. నక్కపల్లిలో కొత్త చరిత్ర సృష్టించబోతున్నామని అన్నారు. విశాఖ ఉక్కు కంటే పెద్ద ఫ్యాక్టరీ ఇక్కడ ఏర్పాటు కాబోతోందని అన్నారు. ఇది ఏపీ సత్తాను ప్రపంచానికి చాటి చెప్పే పరిశ్రమ అని కొనియాడారు.

ఉక్కు రంగంలో ఆర్సెలార్ మిట్టల్ ప్రపంచంలోనే నంబర్ వన్ అని, ప్రధాని మోడీ సహకారంతోనే ఈ పరిశ్రమ ఏర్పాటు సాధ్యమైందని అన్నారు. 20 నెలల్లో రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమాన్ని చేసి చూపించామని చంద్రబాబు అన్నారు. నాకు అన్ని రకాలుగా సహకరిస్తున్న పవన్ కల్యాణ్‌కు అభినందనలు అంటూ తెలియజేశారు. ఈ పరిశ్రమ ఏర్పాటులో మంత్రి లోకేశ్ పాత్ర కీలకంగా పోషించారని చెప్పుకొచ్చారు.

Next Story