- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బంగారం కొనడం తగ్గించుకోవాలి.. ‘కిమ్స్’ సభలో సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు
రాష్ట్ర ప్రజలు బంగారం కొనుగోలును తగ్గించుకోవాలని, ఈ విషయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇస్తున్న సూచనలను అందరూ పాటించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు.

దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్ర ప్రజలు బంగారం కొనుగోలును తగ్గించుకోవాలని, ఈ విషయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇస్తున్న సూచనలను అందరూ పాటించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. బుధవారం అమరావతిలోని నిడమర్రులో కిమ్స్ (KIMS) ఆస్పత్రి, బైసర్ స్కిల్ యూనివర్సిటీలకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సీఎం పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
త్వరలో ‘వర్క్ ఫ్రమ్ హోమ్’పై ప్రకటన
దేశవ్యాప్తంగా ఉత్పత్తి అయ్యే బంగారంలో సుమారు 50 శాతం వాటా ఒక్క కర్నూలు జిల్లా నుంచే వచ్చేలా ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తోందని ముఖ్యమంత్రి వెల్లడించారు. అలాగే, విలాసాల కంటే పొదుపుపై దృష్టి సారించాలని కోరారు. ‘ప్రస్తుతం కాన్వాయ్ అనేది ఒక ఫ్యాషన్‌గా మారిపోయింది. భద్రత అనేది అర్థవంతంగా ఉండాలి తప్ప, ఆడంబరంగా ఉండకూడదు’ అని ఆయన వ్యాఖ్యానించారు. ‘వర్క్ ఫ్రమ్ హోమ్ గురించి నేను ఎప్పుడో చెప్పాను, ఇప్పుడు మళ్లీ అదే ట్రెండ్ వస్తోంది. దీనిపై రేపో ఎల్లుండో ప్రభుత్వం తరఫున ఒక కీలక ప్రకటన చేయబోతున్నాం’ అని ఆయన తెలిపారు.
హైదరాబాద్ కంటే మెరుగ్గా అమరావతి
రాజధాని అమరావతి భవిష్యత్తుపై ముఖ్యమంత్రి ధీమా వ్యక్తం చేశారు. ‘నేను తొలిసారి ముఖ్యమంత్రి అయ్యే నాటికి హైదరాబాద్‌లో కనీస వైద్య సదుపాయాలు, ఆస్పత్రులు ఉండేవి కావు. గల్ఫ్ దేశాల్లోని హాస్పిటాలిటీ రంగాన్ని అధ్యయనం చేసి అక్కడ ఎన్నో సంస్కరణలు తెచ్చాను. ఇప్పుడు అమరావతిని హైదరాబాద్ కంటే మెరుగైన నగరంగా తీర్చిదిద్దుతాం. పారిశ్రామికవేత్తలు ముందుకు వచ్చి అమరావతి అభివృద్ధిలో భాగస్వాములు కావాలి’ అని కోరారు.
లక్ష ఉద్యోగాలే లక్ష్యం..
కూటమి ప్రభుత్వ ప్రధాన ధ్యేయం నిరుద్యోగులకు ఉపాధి కల్పించడమేనని, లక్ష మందికి ఉద్యోగాలు ఇవ్వాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని సీఎం స్పష్టం చేశారు. నిడమర్రులో శంకుస్థాపన చేసిన కిమ్స్ ఆస్పత్రిని 2027 మే 13 నాటికి పూర్తి చేసి, ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని నిర్వాహకులకు సూచించారు. ఆస్పత్రి నిర్మాణానికి అవసరమైన అనుమతులను ప్రభుత్వం త్వరితగతిన మంజూరు చేస్తుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర మంత్రి పయ్యావుల కేశవ్, కిమ్స్ ఆస్పత్రి ప్రతినిధులు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.






