ఢిల్లీకి చేరుకున్న సీఎం చంద్రబాబు.. కాసేపట్లో అమిత్ షా‌తో డిన్నర్ మీట్

by Kema Shiva Kumar |

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా సీఎం చంద్రబాబు నాయుడు మరోసారి ఢిల్లీలో అడుగుపెట్టారు.

ఢిల్లీకి చేరుకున్న సీఎం చంద్రబాబు.. కాసేపట్లో అమిత్ షా‌తో డిన్నర్ మీట్
X

దిశ, వెబ్‌‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా సీఎం చంద్రబాబు నాయుడు (CM Chandrababu) మరోసారి ఢిల్లీలో అడుగుపెట్టారు. ఈ మేరకు ఆయన కేంద్ర పెద్దలతో కేంద్ర బడ్జెట్, పోలవరం, అమరావతి ప్రాజెక్టులకు సంబంధించిన నిధులపై చర్చలు భేటీ కాబోతున్నారు. నేటి పర్యటనలో భాగంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah)తో డిన్నర్ మీట్‌లో పాల్గొననున్నారు. రాష్ట్ర విభజన చట్టంలోని పెండింగ్ అంశాలు, కొత్తగా ఏర్పడిన జిల్లా పోలవరం, మార్కాపురం జిల్లాలకు ఐపీఎస్ అధికారుల కేటాయింపు, రాష్ట్రంలోని శాంతిభద్రతలపై చర్చించనున్నారు. అదేవిధంగా రాజధాని అమరావతి నిర్మాణానికి కేంద్రం నుంచి పూర్తి స్థాయి చట్టబద్ధత కల్పించే అంశం ఈ సమావేశంలో ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

ఇక 2027 నాటికి ప్రాజెక్టును పూర్తి చేయాలన్న లక్ష్యంతో రీహాబిలిటేషన్, రెసెట్టిల్‌మెంట్ పనుల కోసం అదనపు నిధులు కేటాయించాలని కేంద్రాన్ని సీఎం కోరనున్నారు. పోలవరం (Polavaram), అనుబంధ ప్రాజెక్టుల విషయంలో పొరుగు రాష్ట్రాల నుంచి ఎదురవుతున్న న్యాయపరమైన అడ్డంకులను పరిష్కరించడంలో కేంద్రం జోక్యం చేసుకోవాలని కోరే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitaraman) ప్రవేశపెట్టనున్న కేంద్ర బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు పెద్దపీట వేయాలని చంద్రబాబు విజ్ఞప్తి చేయనున్నారు. విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు, స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు అవసరమైన ఆర్థిక ప్యాకేజీపై అంశాలను కూడా చర్చకు రానున్నట్లుగా తెలుస్తోంది. చివరగా రాజధాని అమరావతిని నేషనల్ హైవే గ్రిడ్‌తో అనుసంధానించేలా కొత్త రహదారులు, కృష్ణా నదిపై ప్రతిపాదిత 6 లైన్ల కేబుల్ బ్రిడ్జి నిర్మాణానికి కేంద్రాన్ని సీఎం చంద్రబాబు నిధులు కోరనున్నారు.

Next Story