బీఆర్ అంబేద్కర్ జయంతి.. నివాళులు అర్పించిన సీఎం చంద్రబాబు, నారా లోకేష్

by Naga Rani Yarlagadda |

సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్.. డా. బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా నివాళులు అర్పించారు.

బీఆర్ అంబేద్కర్ జయంతి.. నివాళులు అర్పించిన సీఎం చంద్రబాబు, నారా లోకేష్
X

దిశ, వెబ్‌డెస్క్: భారత రాజ్యాంగ నిర్మాత, సంఘ సంస్కర్త, భారతరత్న డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళి అర్పిస్తున్నట్లు సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. అంటరానితనంతో కులవివక్షకు గురై.. ఉన్నత విద్య చదివి, దేశం గర్వించే అత్యున్నతస్థాయికి ఎదిగిన అంబేద్కర్ మనందరికీ ఆదర్శప్రాయులని పేర్కొన్నారు. ప్రపంచంలో బలమైన ప్రజాస్వామ్య దేశంగా మనదేశం నిలుస్తోందంటే దానికి కారణం అంబేద్కర్ మనకు ఇచ్చిన రాజ్యాంగమేనన్నారు. సమాన అవకాశాలు, హక్కులు అందించి, ప్రతీ పౌరుడికి రాజ్యాంగ రక్షణ కల్పించారన్నారు. అంబేద్కర్ ఆశయ సాధనే మన లక్ష్యం కావాలని, ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తూ.. బాధ్యత కలిగిన పౌరుడిగా ఉండటమే ఆ మహనీయుడికి మనమిచ్చే ఘన నివాళి అని పేర్కొన్నారు.

పేద, బడుగు, బలహీనవర్గాల శ్రేయస్సు, దేశ అభివృద్ధి కోసం జీవితాన్ని అంకితం చేసిన మహోన్నత వ్యక్తి బీఆర్ అంబేద్కర్ అని, సమాజంలో అంటరానితనం, నిర్మూలన, వివక్షపై అలుపెరుగని పోరాటం చేశారని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. భారత రాజ్యాంగంలో అన్నివర్గాల ప్రజలకు సమాన హక్కులు కల్పించిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. ఈ సందర్భంగా బీఆర్ అంబేద్కర్ కు నివాళులు అర్పిస్తున్నట్లు లోకేష్ పేర్కొన్నారు.

Next Story