- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
13, 14 తేదీల్లో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ దిల్లీ పర్యటన
ఈనెల 13,14 తేదీల్లో ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు.

X
దిశ, వెబ్‌డెస్క్: ఈనెల 13,14 తేదీల్లో ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. అక్టోబర్ 14న గూగుల్ అనుబంధ సంస్థ అయిన రైడెన్ తో డేటా సెంటర్ ఏర్పాటుపై ఒప్పందం కుదుర్చుకోనున్నారు. రూ.84 వేల కోట్లతో విశాఖలో ఈ డేటా సెంటర్ ను ఏర్పాటు చేయనున్నారు. కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్, చంద్రబాబు, నారా లోకేష్ ల సమక్షంలో ఈ మేరకు ఒప్పందం జరగనుంది. అలాగే.. ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్రమోదీని సీఎం కలిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 13వ తేదీ ఉదయం సీఆర్డీఏ ప్రాజెక్టు కార్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ ఢిల్లీకి పయనమవ్వనున్నారు.
Next Story






