జాతరకు వెళ్తూ.. తాటిముంజలు రుచి చూసిన సీఎం చంద్రబాబు దంపతులు

by Vemula.Srinu Prasad |

చిత్తూరు జిల్లా కుప్పంలో సీఎం చంద్రబాబు దంపతులు పర్యటించారు. స్థానిక ప్రసన్న తిరుపతి గంగమ్మ జాతరలో పాల్గొన్నారు.

జాతరకు వెళ్తూ.. తాటిముంజలు రుచి చూసిన సీఎం చంద్రబాబు దంపతులు
X

దిశ, వెబ్ డెస్క్: చిత్తూరు జిల్లా(Chittoor District) కుప్పం(Kuppam)లో సీఎం చంద్రబాబు దంపతులు(Cm Chandrababu Couples) పర్యటించారు. స్థానిక ప్రసన్న తిరుపతి గంగమ్మ జాతర(Prasanna Tirupati Gangamma Festival)లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం తిరుగు ప్రయాణంలో ముఖ్యమంత్రి దంపతులు తంజమ్మకొట్టాలు వద్ద ఆగారు. కల్లుగీత కార్మికులు(Toddy Tappers) తాటిముంజలు(Palms) తీస్తుండగా కాన్వాయ్‌ను నిలిపి వారి వద్దకు వెళ్లారు. ‘ముంజలు తీసి ఇవ్వండి... రుచి చూస్తాం’ అని అడిగారు. కార్మికులు అందించిన తాజా తాటిముంజలను సీఎం దంపతులు రుచి చూశారు. కల్లుగీత కార్మికులతో ముఖ్యమంత్రి కాసేపు ఆత్మీయంగా సంభాషించారు. వారి పని తీరు, కుటుంబ పరిస్థితుల గురించి అడిగి తెలుసుకున్నారు. కల్లుగీత కార్మికుల అభివృద్ధికి తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ కట్టుబడి ఉంటుందని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు.

Next Story