చిరు వ్యాపారులను నేరుగా కలిసిన సీఎం చంద్రబాబు

by Ajay Maddhiboyina |

ఏపీ సీఎం చంద్ర‌బాబు ఆదివారం రాత్రి విజ‌య‌వాడ‌లోని బీసెంట్ రోడ్డులో నేరుగా ప్ర‌జ‌లు, వ్యాపారుల‌ను క‌లిసి వారితో ముచ్చ‌టించారు. ఈ సంద‌ర్భంగా చింత‌ల‌పూడి దుర్గారావు అనే వీధి వ్యాపారితో చంద్ర‌బాబు మాట్లాడారు.

చిరు వ్యాపారులను నేరుగా కలిసిన సీఎం చంద్రబాబు
X

దిశ‌, వెబ్ డెస్క్: ఏపీ సీఎం చంద్ర‌బాబు ఆదివారం రాత్రి విజ‌య‌వాడ‌లోని బీసెంట్ రోడ్డులో నేరుగా ప్ర‌జ‌లు, వ్యాపారుల‌ను క‌లిసి వారితో ముచ్చ‌టించారు. ఈ సంద‌ర్భంగా చింత‌ల‌పూడి దుర్గారావు అనే వీధి వ్యాపారితో చంద్ర‌బాబు మాట్లాడారు. దుర్గారావు ప్ర‌మిద‌ల వ్యాపారం చేస్తుండ‌గా వీటిని ఎక్క‌డ నుండి తెచ్చుకుంటార‌ని ప్ర‌శ్నించారు. ప‌ది మంది వ్యాపారులు క‌లిసి మద్రాస్ నుండి తెచ్చుకుంటామ‌ని చెప్పారు.

అంతే కాకుండా జీఎస్టీ స‌వ‌ర‌ణ వ‌ల్ల త‌నకు నెల‌కు రూ.1000 ఆదా అవుతుంద‌ని చెప్ప‌గా సీఎం ఏ విధంగా ఆదా అవుతుంద‌ని ప్ర‌శ్నించారు. దీంతో మందుల కొనుగోలుకు గ‌తంలో రూ.2వేల ఖ‌ర్చు అవ్వ‌గా ఇప్పుడు రూ.1500కు వ‌స్తున్నాయ‌ని చెప్పాడు. ఎక్స్‌రే లకు గతంలో రూ.2వేలు ఖర్చు అవ్వగా ప్రస్తుతం రూ.1600 అవుతుందని దాని ద్వారా రూ.900 మిగులుతుందని చెప్పాడు. ఉచిత గ్యాస్,తల్లికి వందనం పథకం కూడా తనకు అందుతోందని తెలిపాడు. అనంతరం మరికొందరు చిరువ్యాపారులతోనూ చంద్రబాబు మాట్లాడారు.

Next Story