బిల్‌గేట్స్‌తో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ.. అప్పట్లో ఐటీ.. మరిప్పుడేంటి!

by Yella Dhawani Reddy |

దావోస్‌లో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు(CM Chandrababu naidu) మూడో రోజు పర్యటన కోనసాగుతోంది.

బిల్‌గేట్స్‌తో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ.. అప్పట్లో ఐటీ.. మరిప్పుడేంటి!
X

దిశ, వెబ్ సైట్: దావోస్‌(Davos)లో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు(CM Chandrababu naidu) మూడో రోజు పర్యటన కోనసాగుతోంది. పర్యటనలో భాగంగా ఆయన పలువురు పారిశ్రామికవేత్తలతో సమావేశయ్యారు. దావోస్ ప్రొమెనేడ్ మైక్రోసాఫ్ట్ కేఫ్‌లో మైక్రోసాఫ్ట్‌ మాజీ సీఈవో(CEO) బిల్‌గేట్స్‌(BillGates)తో సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్‌ భేటీ అయ్యారు. ఉమ్మడి రాష్ట్రం ముఖ్యమంత్రిగా ఉన్నపుడు తమపై నమ్మకంతో మైక్రోసాఫ్ట్ ఐటీ కేంద్రాన్ని నెలకొల్పడంతో హైదరాబాద్ రూపురేఖలు మారిపోయిన విషయాన్ని బిల్‌గేట్స్‌కు సీఎం చంద్రబాబు ఈ సందర్భంగా గుర్తు చేశారు. అలాగే శరవేగంగా అభివృద్ధి చెందుతోన్న ఏపీలో ఐటీ అభివృద్ధికి సహాయ, సహకారాలను అందించాలని ఆయన కోరారు. ఏపీలో ఏర్పాటు చేయబోతున్న వరల్డ్ క్లాస్ ఏఐ యూనివర్సిటీ సలహామండలిలో భాగస్వామ్యం వహించాలని విజ్ఞప్తి చేశారు.

బిల్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ కార్యకలాపాలకు ఏపీని గేట్‌వేగా నిలపాలని ఏపీ ఐటీ మంత్రి లోకేశ్‌(Nara Lokesh) కోరారు. సీఈఓ హెల్త్‌ ఇన్నోవేషన్‌, డయాగ్నస్టిక్స్‌ ఏర్పాటుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఆఫ్రికా తరహాలో హెల్త్‌ డ్యాష్‌బోర్డ్‌ల ఏర్పాటుకు సహకరించాలని కోరారు. బిల్‌గేట్స్‌ సలహాలు రాష్ట్ర ఐటీ అభివృద్ధికి దోహదపడతాయన్నారు. తమ సహకారంతో స్థానికంగా ఉత్పత్తులపై ప్రపంచ ఆవిష్కరణలు అమలు చేసేలా ఏపీ ప్రభుత్వం పని చేస్తుందని లోకేష్ తెలిపారు. ఇక చాలాకాలం తర్వాత చంద్రబాబును కలవడం ఆనందంగా ఉందని ఈ సందర్భంగా బిల్‌గేట్స్‌(Billgates) అన్నారు. ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలపై సహచరులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు.

Next Story