- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సత్యసాయి శతజయంత్యుత్సవాలు.. అధికారులకు సీఎం దిశానిర్దేశం
సత్యసాయి శత జయంతి ఉత్సవాలను వైభవంగా నిర్వహించాలని సీఎం చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు.

దిశ, వెబ్‌డెస్క్: సత్యసాయి శత జయంతి ఉత్సవాలను వైభవంగా నిర్వహించాలని సీఎం చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఈ ఏడాది నవంబర్ 15 నుంచి 24వ తేదీ వరకూ సత్యసాయి శతజయంతి ఉత్సవాలను నిర్వహించాలని సత్యసాయి సేవాసంస్థ నిర్ణయించిన నేపథ్యంలో సీఎం చంద్రబాబు పుట్టపర్తిలో సత్యసాయి ట్రస్ట్ సభ్యులు, అధికారులతో సమావేశమయ్యారు. ఈ సమావేశానికి కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, రాష్ట్రమంత్రులు నారా లోకేశ్, సవిత, సత్యకుమార్, ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి హాజరయ్యారు.
ఈ సందర్భంగా సత్యసాయి చేపట్టిన కార్యక్రమాలను ట్రస్ట్ కొనసాగించడం, మరికొన్ని కార్యక్రమాలను చేపట్టడాన్ని సీఎం అభినందించారు. శత జయంతి ఉత్సవాలకు వేదికల ఏర్పాట్లు, రవాణా, సెక్యూరిటీ, వసతి, పరిశుభ్రత వంటి అంశాలపై ప్రణాళిక రూపొందించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. దేశ, విదేశాల నుంచి వచ్చే భక్తుల రాకపోకలకు ఇబ్బందులు ఉండకూడదని , స్థానికంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పనకు ఇదొక మార్గదర్శకంగా నిలవాలని సూచించారు. ట్రస్ట్‌కు అవసరమైన సహకారాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందని తెలిపారు.






