పీపీపీపై అసెంబ్లీ వేదికగా సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

by Vemula.Srinu Prasad |

పీపీపీపై అసెంబ్లీ వేదికగా సీఎం చంద్రబాబు మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. పీపీపీ అంటే ప్రైవేటు కాదని ఆయన చెప్పారు. ఈ విధానంతో మెడికల్ కాలేజీలుపూర్తి అవుతాయని, అవన్నీ ప్రభుత్వ ఆస్తులేనని తెలిపారు...

పీపీపీపై అసెంబ్లీ వేదికగా సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: పీపీపీ(PPP)పై అసెంబ్లీ(Assembly) వేదికగా సీఎం చంద్రబాబు(Cm Chandrababu) మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. పీపీపీ అంటే ప్రైవేటు కాదని ఆయన చెప్పారు. ఈ విధానంతో మెడికల్ కాలేజీలు(Medical Colleges) పూర్తి అవుతాయని, అవన్నీ ప్రభుత్వ ఆస్తులేనని తెలిపారు. పీపీపీ విధానంతో త్వరగా ఫలితాలు వస్తాయని, ఇదే ఉత్తమమని చంద్రబాబు పేర్కొన్నారు. జగన్ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో ఉన్న పారిశ్రామిక వేత్తలు సైతం పారిపోయారని గుర్తు చేశారు. రాష్ట్రంలో వైసీపీ ఉన్నంతకాలం తాము వచ్చేదిలేదని పారిశ్రామిక వేత్తలు చెప్పి మరీ వెళ్లిపోయారని చెప్పారు. రాష్ట్ర బ్రాండ్‌ను నిలబెట్టేందుకు చాలా కృషి చేశామని తెలిపారు. పరిశ్రమలతో పాటు, ఉద్యోగాల్లోనూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్కర్నీ మోసం చేసిందని మండిపడ్డారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత టూరిజానికి ఇండస్ట్రీ హోదా ఇచ్చామన్నారు. రాష్ట్రంలో ఉన్న 175 నియోజకవర్గంలోనూ ఇండస్ట్రియల్ పార్కులు పెడుతున్నామని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఇప్పటి వరకూ ప్రభుత్వ రంగంలో 30, 598 ఉద్యాగాలు ఇచ్చామని తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో అయితే మొత్తం 6, 28,323 మంది ఉద్యోగాలు కల్పించామని చంద్రబాబు వెల్లడించారు.

Next Story