- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
CM Chandrababu: లిక్కర్ స్కాంతో ఢిల్లీ పరువు బజారున పడింది.. చంద్రబాబు హాట్ కామెంట్స్
లిక్కర్ స్కాం (Liquor Scam)తో ఢిల్లీ (Delhi) పరువును ఆమ్ఆద్మీ పార్టీ (Aam Aadmi Party) బజారు ఈడ్చిందని సీఎం చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) ఘాటు వ్యాఖ్యలు చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: లిక్కర్ స్కాం (Liquor Scam)తో ఢిల్లీ (Delhi) పరువును ఆమ్ఆద్మీ పార్టీ (Aam Aadmi Party) బజారు ఈడ్చిందని సీఎం చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆమ్ఆద్మీ ప్రభుత్వం (Aam Aadmi Government) విధానాలు సరిగ్గా లేవని ఆరోపించారు. ఒకప్పుడు జనం ఢిల్లీకి వచ్చే వారని.. ప్రస్తుతం ఇక్కడున్న వారే ఇతర ప్రాంతాలకు వలస వెళ్తుండటం బాధకరమని అన్నారు. ఢిల్లీ (Delhi)లో వాయు, రాజకీయ కాలుష్యంతో నిండిపోయిందని సెటైర్లు వేశారు. ముఖ్యంగా లిక్కర్ స్కాంలో ముఖ్యమంత్రి (CM), డిప్యూటీ సీఎం (Deputy CM) ఉండటంతో ఢిల్లీ పరువు కాస్త పోయిందని కామెంట్ చేశారు. ఇలాంటి సమయంలో దేశానికి నరేంద్ర మోడీ (Narendra Modi) నాయకత్వం ఎంతో అవసరం అని అన్నారు.
స్వర్ణాంధ్ర ప్రదేశ్ లక్ష్యం కూడా వికసిత్ భారత్ (Vikasit Bharath)లో భాగమేనని తెలిపారు. ప్రపంచలో ఎక్కడైనా భారతీయులకు మంచి అవకాశాలు ఉన్నాయని అన్నారు. కేంద్ర మంత్రి ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Seetharaman) ప్రవేశపెట్టిన 2025-26 వార్షిక బడ్జెట్ దేశాన్ని సమ్మిళిత ఆర్థిక వృద్ధి వైపు తీసుకెళ్తోందని పేర్కొన్నారు. 2047 వికసిత్ భారత్ లక్ష్యంగా కేంద్ర బడ్జెట్ (Central Budget) ఉందని సంతోషం వ్యక్తం చేశారు. గత పదేళ్లలో ఢిల్లీ (Delhi)లో అభివృద్ధి కుటుంబడిందని కామెంట్ చేశారు. కమ్యూనిజానికి కాలం చెల్లిందని సీఎం చంద్రబాబు అన్నారు. సంపద సృష్టించాలి.. పేదలకు పంచాలి అనేది ఎన్డీఏ (NDA) ప్రభుత్వ విధానమని అన్నారు. ఎవరికి ఓట్లు వేస్తే అభివృద్ధి జరుగుతుందో ఢిల్లీ ప్రజలు ఆలోచించాలని అన్నారు. ఢిల్లీలో బీజేపీ (BJP) గెలుపు.. దేశ ప్రగతికి మలుపు అని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.






